ETV Bharat / bharat

ఎలుక దెబ్బకు ఆగిపోయిన టేకాఫ్​.. డీజీసీఏ దర్యాప్తు - జమ్ముకశ్మీర్ వార్తలు

Air India Flight: మరికొద్ది సేపట్లో ఆ విమానం బయలుదేరేది. ఇంతలో ఉన్నట్లుండి ఆ విమానం టేకాఫ్​ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు సిబ్బంది. దాదాపు రెండు గంటల తర్వాత ఆ విమానం డిపార్చర్​ అయింది. ఈ ఘటన శ్రీనగర్​ ఎయిర్​పోర్ట్​లో జరిగింది. ఈ ఆలస్యం అంతటికీ కారణం ఓ ఎలుక!

air india
air india
author img

By

Published : Apr 22, 2022, 4:30 AM IST

Updated : Apr 22, 2022, 4:46 AM IST

Air India Flight : సాధారణంగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రయణాలు ఆలస్యమవుతుంటాయి. కానీ శ్రీనగర్​ ఎయిర్​పోర్ట్​లో మరికాపేట్లో టేకాఫ్​కు సిద్ధంగా ఉన్న ఎయిర్​ఇండియా విమానానికి మాత్రం ఓ ఎలుక తలనొప్పిగా మారింది. జమ్ముకు వెళ్లాల్సిన ఈ విమానంలో ఎలుక ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది దానిని పట్టుకునేందుకు దాదాపు రెండు గంటలు శ్రమించారు. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం.. 4.10 గంటలకు టేకాఫ్​ అయింది.

ఇందుకు సంబంధించి డీజీసీఏ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై ఎయిర్​ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఎయిర్​ఇండియా సంస్థ బాధ్యతలను టాటా చేపట్టాక ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరు 8న ప్రభుత్వం నుంచి వేలంలో సంస్థను కొనుగోలు చేసిన టాటా సంస్థ.. ఈ ఏడాది జనవరి 27 నుంచి బాధ్యతలు అందుకుంది.

ఇదీ చూడండి : మాజీ సహోద్యోగిపై కోపం.. పబ్లిక్ టాయిలెట్లలో అలా..!

Last Updated : Apr 22, 2022, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.