కామంతో కళ్లు మూసికుపోయిన కొందరు మృగాళ్లు.. ఓ వివాహితను తన ఇంట్లోనే కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. ఈ పాశవిక చర్య కర్ణాటక మండ్యా జిల్లాలో జరిగింది. ఈ ఘటనతో సమీప ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
బాధితురాలి కుమారుడు రాత్రి ఇంటికి వచ్చే సరికి.. బెడ్రూంలో తల్లి విగతజీవిగా పడి ఉంది. తన తల్లిని హత్య చేశారని గుర్తించి వెంటనే తన తండ్రికి సమాచారమందించాడు.
హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్స్‌ను పిలిపించి తనిఖీ చేయించారు.
ఘటనపై దర్యాప్తును వేగంగా చేపట్టి దుండగులను అరెస్ట్ చేస్తామని తెలిపారు పోలీసులు.
ఇదీ చూడండి: బాలికపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి...