ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలు, ఆమె తల్లిపై అమానవీయ దాడి - రాజస్థాన్​లోని టోంక్​ జిల్లాలో అమానవీయ ఘటన

పదిహేడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని పరిష్కరిస్తానని బాధితురాలిని, ఆమె తల్లిని తన ఇంటికి పిలిచాడు. అలా వెళ్లినవారిని నగ్నంగా మార్చి, ఆపై దాడికి దిగారు నిందితుడి కుటుంబ సభ్యులు.

Rape victim, mother stripped naked and assaulted; five held
రేప్​ బాధితురాలు, ఆమె తల్లిపై అరాచకం
author img

By

Published : Mar 10, 2021, 3:31 PM IST

రాజస్థాన్​లోని టోంక్​ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. అత్యాచార బాధితురాలైన ఓ మైనర్​ సహా ఆమె తల్లిని నగ్నంగా మార్చి.. దాడి చేశారు నిందితుడి కుటుంబ సభ్యులు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఏం జరిగింది?

టోంక్​ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అపహరించి, మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పరిష్కరించే నెపంతో తల్లి, కుమార్తెను నిందితుడు తమ వద్దకు రావాలని పిలిచాడు. అలా వెళ్లిన వారిరువురిపై నిందితుడి అత్తమామలు క్రూరంగా ప్రవర్తించారు. వారిని నగ్నంగా మార్చి.. దాడికి దిగారు. ఈ ఘటనపై ఫిబ్రవరి 15న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్​పురా డీఎస్పీ చక్రవర్తి సింగ్​ రాథోడ్​ వెల్లడించారు.

"బాధితురాలికి వైద్య పరీక్షలు చేశాం. మూడుసార్లు నిందితుడు ఆమెను వేధించాడు. సొంత సామాజిక వర్గంలోని వారు కూడా తనను ఒత్తిడికి గురిచేశారని ఆమె చెప్పింది. నిందితుడికి ఇది వరకే వివాహమైంది. బాధితురాలితో అతడు చెడుగా ప్రవర్తించాడు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం."

-డీఎస్పీ చక్రవర్తి సింగ్​ రాథోడ్

ఈ కేసును తొలుత మహిళా ఫిర్యాదుల కమిటీ అధికారి అశోక్​ బుటోలియా దర్యాప్తు చేపట్టారు. అనంతరం చక్రవర్తి సింగ్​ రాథోడ్​కు బదిలీ చేశారు. ఫిర్యాదు చేసి 22 రోజులు పూర్తైనప్పటికీ.. అశోక్​ బుటోలియా ఎవరినీ అరెస్టు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి ఘటనలు.. ప్రజల్లో భయాన్ని కల్గించడమే కాకుండా.. అవమానకరంగాను నిలుస్తాయని మండిపడ్డారు.

ఇదీ చూడండి:లోయలో పడ్డ బస్సు- 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.