Rape Victim: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇంటిబయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో జరిగింది.
బాధితురాలు ఇంటి సమీపంలో నివసించే యువకుడు.. ఆదివారం సాయంత్రం చిన్నారి ఆడుకుంటుండగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడి ఇంటిని నుంచి బయటకు వచ్చిన చిన్నారి.. తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి : బార్లో రహస్య గది.. అద్దం పగలగొడితే 17మంది అమ్మాయిలు