ETV Bharat / bharat

ట్రాన్స్​ఉమన్​తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా... - ట్రాన్స్​జెండర్​

అమె ఓ ట్రాన్స్​ఉమన్​. తనకు ఇష్టమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడు. కానీ ఆ ప్రేమను వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమను గెలిపించుకునేందుకు వారు పెళ్లి చేసుకున్నారు. ఇదీ తమిళనాడులోని రియా-మనో కథ.

kallakurichi news
ట్రాన్స్​ఉమెన్​తో యువకుడి పెళ్లి
author img

By

Published : Oct 28, 2021, 2:09 PM IST

ట్రాన్స్​ఉమన్​తో యువకుడి పెళ్లి

తమిళనాడు కల్లకురిచి జిల్లా ఉల్లుంతుపట్టాయ్​లో.. ట్రాన్స్​ఉమన్​ రియా (25), మనో(29) వివాహం ఈ నెల 27న జరిగింది. వీరి వివాహానికి ట్రాన్స్​జెండర్లు తరలివెళ్లారు. నిజమైన ప్రేమకు చిహ్నంగా నిలిచారంటూ నవవధువులను ఆశీర్వదించారు.

రియా-మనో ఇద్దరు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి మధ్య ప్రేమ చిగురించగా.. వారి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను గెలిపించుకునేందుకు, బుధవారం ఉదయం హిందు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

Transwomen gets married to youth in Kallakurichi
రియాతో మనో వివాహం

అయితే ఈ తరహా వివాహం ఇది తొలిసారి కాదు. గతంలో కోయంబత్తూర్​, తుత్తుకూడి జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కోయంబత్తూర్​లో జరిగిన వివాహాన్ని రిజిస్టర్​ చేయమని అధికారులు తేల్చిచెప్పడం వివాదానికి దారితీసింది. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు మధురై బెంచ్.. వారి వివాహాన్ని రిజిస్టర్​ చేయమని ఆదేశించింది.

రియా-మనో జంట

ఇదీ చూడండి:- ప్రయాణంలోనే మహిళ ప్రసవం- వెనక్కి తిరిగొచ్చిన రైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.