ETV Bharat / bharat

'డాన్సింగ్​ పోలీస్'​ ఔదార్యం.. చెప్పులు లేని బాలుడ్ని చూసి...

author img

By

Published : May 20, 2022, 1:09 PM IST

Ranjeet singh indore: మండుటెండలో చెప్పులు లేకుండా రోడ్డు దాటేందుకు వచ్చిన ఆ బాలుడిని చూసి జాలిపడిన ట్రాఫిక్​ పోలీస్​.. రోడ్డు దాటేవరకు ఆ కుర్రాడిని తన కాళ్లపైన నిల్చోపెట్టుకున్నారు. అనంతరం అతనికి చెప్పులు కొనిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో జరిగింది.

traffic police
traffic police

Ranjeet singh indore traffic cop: రణగొణ ధ్వనుల మధ్య శ్రమ తెలియకుండా ఉండేందుకు డాన్స్​ చేస్తూ ట్రాఫిక్​ను కంట్రోల్​ చేసి డాన్సింగ్​ ట్రాఫిక్​ కాప్​గా గుర్తింపు పొందిన ఇన్​స్పెక్టర్​ రంజిత్​ సింగ్ మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. భానుడి భగభగలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆయన ఓ చిన్నారి పట్ల చూపించిన ఔదార్యమే అందుకు కారణం. మధ్యప్రదేశ్​లోని​ ఇందోర్​లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరలయ్యాయి.

traffic police
బాలుడిని కాళ్ల మీద నిల్చోపెట్టుకున్న రంజిత్
traffic police
ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్ రంజిత్

ఇదీ జరిగింది.. ట్రాఫిక్​ కంట్రోల్​ చేయడంలో రంజిత్​ బిజీగా ఉన్న సమయంలో రోడ్డు దాటేందుకు వచ్చిన ఓ ఇద్దరు చిన్నారులు ఆయన కంటపడ్డారు. ఇంతలో వాళ్లే రంజిత్​ దగ్గరకు వచ్చి రోడ్డు దాటించేందుకు సాయం చేయమని అడిగారు. రెడ్​ సిగ్నల్​ పడేంత వరకు ఆగమన్న రంజిత్​.. ఆ ఇద్దరి కుర్రాళ్లలో ఒకరు చెప్పులు లేకుండా ఉండటం గమనించారు. మండుటెండలో చెప్పులు లేకుండా తిరగడం చూసి జాలిపడిన రంజిత్​.. ఆ కుర్రాడిని కాసేపు అయన పాదాల మీద నిల్చోపెట్టుకున్నారు. అనంతరం ఆ బాలుడిని షాపుకు తీసుకెళ్లి మంచి చెప్పుల జత ఒకటి కొనిచ్చారు. మరోవైపు రంజిత్​ కాళ్లపై కుర్రాడు నిల్చున్న ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రంజిత్​ చేసిన పనికి స్థానికులతో పాటు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేశారు.

"రోడ్డు దాటించమని ఆ చిన్నారులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఓ అబ్బాయికి చెప్పులు లేకుండా ఉండటం చూశాను. మిట్ట మధ్యాహ్నం అంత వేడిలో చెప్పులేకుండా వచ్చిన ఆ కుర్రాడు బాగా ఇబ్బంది పడ్డాడు. అందుకే అతనికి చెప్పులు కొనిచ్చాను."

-రంజిత్, ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​

ఇదీ చూడండి : రోజూ ఇల్లు ఊడుస్తున్నారు.. పరిశుభ్రతలో మనమే టాప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.