Rana Ayyub ED: ప్రముఖ జర్నలిస్ట్ రానా ఆయుబ్‌పై ఈడీ కొరడా ప్రయోగించింది. మనీలాండరింగ్ కేసులో రూ.1.77 కోట్లను అటాచ్ చేసింది. దాతలు ఇచ్చే నిధులను వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించారన్న కేసు దర్యాప్తులో భాగంగా నగదును సీజ్ చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ మేరకు ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. రానాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు బ్యాలెన్స్‌ను అటాచ్ చేసినట్లు తెలిపింది.
2021 సెప్టెంబర్‌లో రానా ఆయుబ్‌పై ఈ కేసు నమోదైంది. స్వచ్ఛంద సేవ కోసం సమీకరించిన నిధులను ఆమె వినియోగించుకున్నారని ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 'నెహ్రూ వైఫల్యం వల్లే గోవాకు ఆలస్యంగా స్వాతంత్ర్యం'