అలోపతి వైద్యంపై(Allopathic medicine) యోగా గురు బాబా రాందేవ్(Ramdev) ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వచ్చే నెల ఒకటో తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ల సమాఖ్య ప్రకటించింది. రాందేవ్(Ramdev) ప్రకటనలు తీవ్ర అభ్యంతరకరమని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని సమాఖ్య డిమాండ్ చేసింది. లేకపోతే 1897 మహమ్మారి వ్యాధుల చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొంది.
కొవిడ్-19(Covid-19) చికిత్సలో ఉపయోగిస్తున్న అలోపతి ఔషధాల(Allopathic medicine) సామర్థ్యంపై ఇటీవల రాందేవ్(Ramdev) అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మందుల కారణంగా లక్షలాది మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. చివరకు ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయితే.. మరుసటి రోజే అలోపతి ఔషధాలపై సందేహాలను లేవనెత్తుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు 25 ప్రశ్నలు సంధించారు.
ఇదీ చదవండి:బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ సోకిన తొలి రోగి మృతి