Ramadan CELEBRATIONS Attari: ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు, దర్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. పంజాబ్‌లోని అట్టారి వాఘా సరిహద్దులో భారత్, పాకిస్థాన్ సైనికులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.


వివిధ పండుగల సందర్భంగా ఇరు దేశాల సైన్యం.. శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్వీట్లు పంచుకునే సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. సాధారణ సమయాల్లో భారత్, పాకిస్థాన్ సైనికుల మధ్య తగాదాలు ఉన్నా పండగ సమయాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటారు.


ఇదీ చదవండి: రంజాన్ వేళ జోధ్‌పుర్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ బంద్