Ram Mandir Pran Pratistha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. రామ భక్తులు, హిందువులు సహా భారతీయులందరూ ఇందులో పాల్గొనాలంటూ రాయ్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
-
VIDEO | "'Pran Pratishtha' will be held at 12:20 pm on January 22 in the presence of PM Modi, RSS Sarsanghchalak Mohan Bhagwat, UP Governor Anandiben Patel and UP CM Yogi Adityanath. Nearly 4,000 saints and mahatmas will attend the ceremony. It's a request to the Hindu society… pic.twitter.com/ORbSgxUlP8
— Press Trust of India (@PTI_News) January 8, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "'Pran Pratishtha' will be held at 12:20 pm on January 22 in the presence of PM Modi, RSS Sarsanghchalak Mohan Bhagwat, UP Governor Anandiben Patel and UP CM Yogi Adityanath. Nearly 4,000 saints and mahatmas will attend the ceremony. It's a request to the Hindu society… pic.twitter.com/ORbSgxUlP8
— Press Trust of India (@PTI_News) January 8, 2024VIDEO | "'Pran Pratishtha' will be held at 12:20 pm on January 22 in the presence of PM Modi, RSS Sarsanghchalak Mohan Bhagwat, UP Governor Anandiben Patel and UP CM Yogi Adityanath. Nearly 4,000 saints and mahatmas will attend the ceremony. It's a request to the Hindu society… pic.twitter.com/ORbSgxUlP8
— Press Trust of India (@PTI_News) January 8, 2024
"ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగుతుంది. సుమారు 4,000 మంది సాధువులు ఇందులో పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ రోజు ఉదయం 10 గంటలకు ఆలయాల్లో భజనలు చేయాలని కోరుతున్నాను. ఆలయ యాజమాన్యాలు ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాటు చేయాలి. రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం హారతి ఇచ్చాకే అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి. వారి ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా ప్రసాద పంపిణీ చేయాలి. సాయంత్రం ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలి."
--చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి
రాముడితో గర్భగుడిలోకి మోదీ
అయోధ్య రాముడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. 84 సెకన్ల అద్భుత ముహూర్తంలోనే ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ సుమారు 300 మీటర్లు నడవనున్నారు. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలోనే చేరుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని కాశీకి చెందిన పండిత్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో జరగనుంది.
"ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు మొత్తం సుమారు 40 నిమిషాల వరకు ఉంటుంది. అయితే, అసలు ముహూర్తం మాత్రం కేవలం 84 సెకన్లు మాత్రమే. ఆ సమయంలోనే ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ పూజ చేస్తారు. కాశీకి చెందిన 50 మంది పండితులు ఇందులో పాల్గొంటారు. వీరిలో ఐదుగురు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. మిగిలిన పూజారులు 14, 15 తేదీల్లో చేరుకుంటారు."
--సునీల్ లక్ష్మీకాంత్ దీక్షిత్, పండితులు
వారం ముందు నుంచే పూజలు
జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16న విగ్రహాన్ని చెక్కిన ప్రాంగణంలో పూజలు చేసి శిల్పిని సన్మానిస్తారని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి అశోక్ తివారీ చెప్పారు. 17న గర్భగుడిని సరయూ నదీ జలాలతో సంప్రోక్షన చేస్తారు. 18న గంధం, సుగంధితో, 19న ఉదయం ఫలాలతో సాయంత్రం చిరుధాన్యాలతో పూజలు చేస్తారు. 20న ఉదయం పూలతో సాయంత్రం నెయ్యితో రాముడికి పూజలు నిర్వహిస్తారు. 21న తేనె, స్వీట్లను అందించి రాముడిని నిద్రబుచ్చనున్నారు. అనంతరం 22న ప్రాణప్రతిష్ఠ జరిగే రాముడి కళ్లగంతలు విప్పి అద్దంలో చూపించనున్నారు.
రాముడి విగ్రహ ఊరేగింపు రద్దు
మరోవైపు జనవరి 17న అయోధ్యలో నిర్వహించతలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రద్దు చేసింది. ప్రతిష్ఠాపన వేడుకకు ముందు అయోధ్యలో రామ్ లల్లా కొత్త విగ్రహాన్ని చూసేందుకు భక్తులను అనుమతించాలని అనుకున్నప్పటికీ, అధిక రద్దీ భయంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు రామజన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహం ప్రదర్శనను ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది. కాశీలోని ఆచార్యులు, సీనియర్ పరిపాలనా అధికారులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్ లల్లా కొత్త విగ్రహాన్ని నగరంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లినప్పుడు భక్తులు, యాత్రికులు అధిక సంఖ్యలో చూడటానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని నియంత్రించడం కష్టమవుతుందని ఊరేగింపును రద్దు చేసినట్టు తెలుస్తోంది.
ప్రాణప్రతిష్ఠకు 7వేల మంది అతిథులు- విదేశాల్లో ఉన్నా స్వయంగా వెళ్లి ఆహ్వానం
అయోధ్య రామయ్యకు అత్తారింటి కానుకలు- విల్లు, పట్టు బట్టలు సైతం!