ETV Bharat / bharat

Rakesh tikait: అఖిలేశ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన టికాయిత్​! - భాజపాపై రాకేశ్ టికాయిత్​

Rakesh tikait in election: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆహ్వానాన్ని రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ తోసిపుచ్చారు​. కేంద్రం తమకు ఇచ్చిన హామీలు యూపీలో కూడా అమలయ్యేలా తాము పోరాడుతామని చెప్పారు.

rakesh tikait
టికాయిత్
author img

By

Published : Dec 18, 2021, 10:26 PM IST

Rakesh tikait in election: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేఖ్ యాదవ్ ఆహ్వానాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్​ శనివారం తిరస్కరించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే.. ఉత్తర్​ప్రదేశ్​లో అధిక విద్యుత్ ఛార్జీలు పెంపు సహా చెరకు రైతులకు చెల్లింపుల్లో జాప్యంపై ప్రభుత్వానికి తాను వ్యతిరేకంగా తాను పోరాడుతానని చెప్పారు.

"కేంద్రం మాతో అంగీకరించిన ఒప్పందాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా మేం పోరాడుతాం. రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు ఇవ్వడం లేదు. మిల్లులకు ప్రభుత్వమే హామీదారు అయినందున.. చెల్లింపుల విషంయలో మిల్లులను ఒత్తిడి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది."

-రాకేశ్ టికాయిత్​, భారతీయ కిసాన్ యూనియన్ నేత

Tikait on Bjp: గ్రామాల్లోకి భాజపా నేతల రాకను ఎవరూ ఆపరని, వాళ్లు స్వేచ్ఛగా ప్రచారం చేస్తారని రాకేశ్ టికాయిత్ అన్నారు. భాజపాకు ప్రజలెవరూ ఓటు వేయరని చెప్పారు. రాష్ట్రంలో చెరకు రైతులకు సకాలంలో చెల్లించాలని, హరియాణాతో సమానంగా విద్యుత్ ఛార్జీలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారని చెప్పారు. విద్య, నిరుద్యోగం, ఎంఎస్​పీపై కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు.

మహిళల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని టికాయిత్ ప్రశంసించారు.

'నా ఫొటోలు వాడొద్దు..'

అంతకుముందు.. ఏ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనని టికాయిత్ అన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో తన ఫొటోలను వినియోగించుకోవద్దని కోరారు. దిల్లీ నుంచి ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు చేరుకున్న ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: Sukesh Chandrashekar Case: 'జైలు సిబ్బందికి ప్రతి నెలా రూ.కోటి లంచం'

ఇదీ చూడండి: Rahul Hindutvawadi: 'హిందుత్వవాదులే గంగానదిలో ఒంటరిగా స్నానం చేస్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.