ETV Bharat / bharat

నేడు రాజ్యసభ ఎన్నికలు.. అక్కడ పోరు రసవత్తరం - Rajya sabha elections 2022

Rajya sabha elections: 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఈ సారి రెండు స్థానాలకు గట్టి పోటీ ఎదురుకానుంది.

rajya-sabha-elections-today
నేడు రాజ్యసభ ఎన్నికలు.. అక్కడ పోరు రసవత్తరం
author img

By

Published : Jun 10, 2022, 5:01 AM IST

Updated : Jun 10, 2022, 6:38 AM IST

Rajya sabha: రాజ్యసభ ఎన్నికలకు (Rajyasabha polls) వేళ అయ్యింది. 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో నాలుగు రాష్ట్రాల్లో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న భాజపా బలం సైతం నూరులోపే పరిమితం కానుంది.

జూన్‌- ఆగస్టు మధ్య వివిధ తేదీల్లో 57 మంది ఎంపీల పదవీకాలాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి. రెండు అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్‌ పూర్తయిన గంట తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఆ రెండు స్థానాలకు గట్టి పోటీ..

  • రాజ్యసభ ఎన్నికల్లో ఈ సారి రెండు స్థానాలకు గట్టి పోటీ ఎదురుకానుంది. రాజస్థాన్‌ నుంచి స్థానికేతరులను బరిలోకి దించడంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి రాజుకుంది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా ప్రయత్నాలు చేపట్టింది. జీ మీడియా గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్రను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి మద్దతు ప్రకటించింది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి గెలవాలంటే 41 స్థానాల అవసరం ఉంది. కాంగ్రెస్‌ రెండు స్థానాలు, భాజపా ఒక స్థానం సులువుగా గెలుచుకునే వీలుండగా.. సుభాష్‌ చంద్ర రూపంలో మరో అభ్యర్థి బరిలోకి దిగడం గట్టి పోటీ నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హోటళ్లకు తరలించింది.
  • రెండు స్థానాలున్న హరియాణాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఓ అభ్యర్థి గెలవాలంటే 31 ఓట్లు కావాలి. సరిగ్గా అంతే బలం ఉన్న కాంగ్రెస్‌ నుంచి అజయ్‌ మాకెన్‌ బరిలోకి దిగుతున్నారు. ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు దక్కనీయకుండా చేసేందుకు ఇక్కడా మరో మీడియా అధిపతి కార్తికేయ శర్మ స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇక్కడ భాజపా ఆయనకు మద్దతిస్తోంది. దీంతో రాజస్థాన్‌, హరియాణాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా భాజపా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

మహారాష్ట్రలో 'కూటమి'కి చుక్కెదురు..
మహారాష్ట్రలో అధికార కూటమికి చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్‌ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాష్ట్రమంత్రి నవాబ్‌ మాలిక్‌లు చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. మొత్తం 6 స్థానాలకు గాను శివసేన 2, కాంగ్రెస్‌, ఎన్సీపీ చెరో స్థానానికి పోటీకి సిద్ధమయ్యాయి. భాజపా కూడా మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభలో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అయితే, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం ఉంది. 106 సభ్యులున్న భాజపాకు కూడా రెండుస్థానాలు గెలువగలదు. కేవలం ఆరో స్థానంలో మాత్రమే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం మహావికాస్‌ అఘాడీకి సమస్యగా మారింది.

  • ఏపీ నుంచి భాజపా నుంచి సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్‌ల పదవీకాలం ముగిసింది.
  • పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉండడంతో ఈసారి రెండు స్థానాలనూ ఆ పార్టీనే గెలుచుకోనుంది. ఫలితంగా అక్కడి నుంచి కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పార్టీలు ప్రాతినిధ్యం కోల్పోనున్నాయి.
  • బహుజన్‌ సమాజ్‌ పార్టీ పెద్దల సభలో ఒక్క స్థానానికే పరిమితం కానుంది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఎనిమిదింటిని భాజపా, దాని మిత్రపక్షాలు, మూడింటిని ఎస్పీ గెలుచుకోనున్నాయి.
  • ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందే వారంతా జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

ఇదీ చదవండి: జులై 18న రాష్ట్రపతి ఎన్నిక.. 21న ఓట్ల లెక్కింపు

Last Updated : Jun 10, 2022, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.