ETV Bharat / bharat

'ఆపద వేళ.. ఆశాకిరణంలా 2-డీజీ డ్రగ్'​ - డీఆర్​డీఓ కొవిడ్​ ఔషధం

కొవిడ్​పై పోరులో ఆశాకిరణంలా 2-డీజీ ఔషధాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) అందుబాటులోకి తీసుకువచ్చిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడల్లా డీఆర్​డీఓ అండగా ఉంటోందని కొనియాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​తో కలిసి ఆయన ఈ ఔషధాన్ని విడుదల చేశారు.

rajnath singh, harsha vardhan
రాజ్​నాథ్​ సింగ్​, హర్షవర్ధన్​
author img

By

Published : May 17, 2021, 1:48 PM IST

Updated : May 17, 2021, 2:24 PM IST

కొవిడ్​పై పోరులో ఆశాకిరణంలా 2-డీయాక్సీ-డీ గ్లూకోజ్‌(2-డీజీ) ఔషధం అందుబాటులోకి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని రూపొందించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ)ను ఆయన ప్రశంసించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​తో కలిసి 2-డీజీ ఔషధాన్ని ఆయన దిల్లీలో విడుదల చేశారు. తొలి బ్యాచ్‌ 2-డీజీ సాషెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్య మంత్రి వాటిని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు ఇచ్చారు.

"దేశం ఆపదలో ఉన్నప్పుడల్లా డీఆర్​డీఓ అండగా నిలుస్తోంది. 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసినందుకు డీఆర్​డీఓ ఛైర్మన్​ జి.సతీష్​ రెడ్డికి, శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మన దేశంలో విపత్తు వేళ ఆశాకిరణంలా ఈ ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇది శాస్త్రీయ పురోగతికి గొప్ప ఉదాహరణ. మన దేశం ముందున్న కఠిన పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం మన శాస్త్రవేత్తలకు ఉందని నేను నమ్ముతున్నాను.

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి

ఆక్సిజన్​ అవసరం తగ్గతుంది..

2-డీజీ ఔషధంతో కొవిడ్​ రోగుల్లో ఆక్సిజన్‌పై చికిత్స పొందే సమయం తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. భవిష్యత్​లో ఈ ఔషధాన్ని ప్రపంచ దేశాల్లో కూడా వినియోగిస్తారని అన్నారు.

"దేశీయంగా కొవిడ్​ చికిత్స కోసం రూపొందించిన తొలి ఔషధం 2-డీజీనే కావచ్చు. ఇది ఆక్సిజన్​పై చికిత్స పొందే సమయాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం.. భారత్​లోనే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా రానున్న రోజుల్లో ఉపయోగపడతుందని నమ్ముతున్నాను. ఏడాదిపైగా కాలం నుంచి మనం.. కొవిడ్ మహమ్మారిపై పోరాడుతున్నాం. వ్యాక్సిన్​ను మన శాస్త్రవేత్తలు రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నేను డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. కరోనాపై పోరులో ప్రధానమంత్రి నాయకత్వంలో డీఆర్​డీఓ కీలక పాత్ర పోషించింది."

-హర్షవర్ధన్​ సింగ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి ఈ ఔషధాన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో 2-డీజీ ఔషధం తయారు చేశారు.

ఇదీ చూడండి: వారిలో ఆసుపత్రి అవసరం 0.06% మందికే!

ఇదీ చూడండి: తగ్గుతున్న ఉద్ధృతి- కొత్త కేసులు 2.81 లక్షలు

Last Updated : May 17, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.