ETV Bharat / bharat

రాజస్థాన్ కేబినెట్​ విస్తరణ.. పైలట్​ వర్గానికి పెద్దపీట! - రాజస్థాన్ క్యాబినెట్ వార్తలు

రాజస్థాన్ కేబినెట్​ విస్తరణ(rajasthan cabinet expansion) ఆదివారం జరగనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నివాసంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం అశోక్‌ గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసి మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో పైలట్ వర్గానికి చోటు కల్పించనున్నారు(rajasthan cabinet news).

Oath-taking ceremony of new ministers to take place tomorrow

author img

By

Published : Nov 20, 2021, 4:39 PM IST

ఎట్టకేలకు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు(rajasthan cabinet expansion). పార్టీ హైకమాండ్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ వర్గానికి ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం అశోక్‌ గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసి మాట్లాడారు. ప్రస్తుతం సీఎం అశోక్ గెహ్లోత్‌ సహా 21మంది మంత్రులు ఉన్నారు. శాసనసభలో ఉన్న 200మంది సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో గరిష్ఠంగా 30మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది(rajasthan cabinet expansion 2021).

రాజస్థాన్‌ గవర్నర్‌ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి(rajasthan cabinet news). ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌, సీఎం అశోక్‌ గెహ్లోత్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం మంత్రిమండలి సమావేశమై రాజీనామాకు సిద్ధపడిన ముగ్గురు మంత్రుల వ్యవహారంపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి(rajasthan cabinet expansion news). రెవెన్యూ మంత్రి హరీష్‌ చౌదరీ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ, విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌లు కేబినెట్‌ నుంచి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మంత్రి గోవింద్‌ సింగ్‌ రాజస్థాన్ పీసీసీ అధ్యక్షునిగా ఉండగా.. మిగితా ఇద్దరిలో డాక్టర్‌ రఘుశర్మ, హరీష్‌ చౌదరీలు గుజరాత్‌, పంజాబ్‌ పార్టీ వ్యవహారాల బాధ్యులుగా నియమితులయ్యారు.

ఇదీ చదవండి: ఇమ్రాన్​ను 'పెద్దన్న'గా సంబోధించిన సిద్ధూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.