రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకొస్తూ రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరికీ బీమా కల్పించటం దేశంలోనే తొలిసారి. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చిరంజీవి ఆరోగ్య బీమా పథకం కింద.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను ప్రభుత్వం కల్పించింది.
ఇటీవల బడ్జెట్‌లో ఈ పథకం గురించి సీఎం అశోక్ గెహ్లాత్ ప్రస్తావించగా.. తాజాగా దాని అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రజలంతా చిరంజీవి ఆరోగ్య బీమా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు బీమా వర్తించనుంది. తద్వారా ప్రజలంతా నగదు రహిత చికిత్స పొందవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి: 'రీ-ఇన్‌ఫెక్షన్'కు శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే