రాజస్థాన్ జైపుర్ మహిళలు అరుదైన ఘనత సాధించారు. ఒకే ప్రాంతంలో భారీ సంఖ్యలో మర్రి మొక్కలు నాటి ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. మహవీర్ ఇంటర్నేషనల్ పింక్ సిటీ స్వచ్ఛంద సంస్థ, మాండా భోప్వాస్ గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆగస్టు 8న మాండా భోప్వాస్ గ్రామంలో మొక్కలను నాటారు మహిళలు .
![banyan garden](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12716622_jaipur.jpg)
![women in banyan plantataion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jpr-02-mahaveer-pkg-72033319_08082021182637_0808f_1628427397_721.jpg)
500 మంది మహిళలతో..
ఈ కార్యక్రమంలో 500 మంది మహిళలు పాలుపంచుకున్నారు. 16 బీఘాల ప్రాంతంలో వీరు మొక్కలను నాటారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రివనం ఇదే కావడం వల్ల.. 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో వీరికి స్థానం దక్కింది. మొత్తం 2,100 మొక్కలను వారు నాటగా.. అందులో మర్రి మొక్కలు సంఖ్య 500గా ఉంది. ఈ ప్రపంచ రికార్డుతో వారంతా ఎంతో మురిసిపోతున్నారు.
![women in banyan plantataion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jpr-02-mahaveer-pkg-72033319_08082021182637_0808f_1628427397_721.jpg)
![manda bhopawas village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jpr-02-mahaveer-pkg-72033319_08082021182637_0808f_1628427397_506.jpg)
![golden book of world records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12713460_thumkajaa.jpg)
పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: 'శివుడే మా సీఎం- కరోనాతో మాకు భయమేంటి?'
ఇదీ చూడండి: సినీ హీరో ఔదార్యం- ఐదు ప్రాణాలు సేఫ్