ETV Bharat / bharat

విషాహారం ఇచ్చి బాలికపై గ్యాంగ్​ రేప్​! - అత్యాచారం

రాజస్థాన్​లో ఓ బాలికపై సాముహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు, విషాహారం ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాధితురాలిని అడవిలో పడేసి వెళ్లారని వెల్లడించారు.

gang-rape
అత్యాచారం
author img

By

Published : Apr 4, 2021, 2:10 PM IST

రాజస్థాన్​లో దారుణం జరిగింది. భరత్​పుర్​కు చెందిన ఓ ఎస్​సీ బాలికను కొందరు దుండగలు ఎత్తుకెళ్లి, విషాహారం ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి31న జరిగిన ఈ సంఘటన బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

"బాలికను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను అడవిలో వదిలేసి వెళ్లారు."

-సునీల్​ కుమార్​ గుప్తా, పహారీ ఎస్పీ

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని పోలీసులు ​పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్​సీ-ఎస్​టీ వేధింపుల చట్టం, ఫోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.