Rajasthan Accident News : రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్టేక్ చేయబోయి ఓ కారును లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నౌరంగ్‌దేశర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో లారీ.. బలంగా కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ఏడుగురు ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
-
STORY | Seven members of a family were killed while two others were injured in a head-on collision between a car and a truck in Rajasthan's Hanumangarh district, police said on Sunday. The accident occurred on Saturday night when the family was returning home from a function.… pic.twitter.com/i2viPcWMXf
— Press Trust of India (@PTI_News) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">STORY | Seven members of a family were killed while two others were injured in a head-on collision between a car and a truck in Rajasthan's Hanumangarh district, police said on Sunday. The accident occurred on Saturday night when the family was returning home from a function.… pic.twitter.com/i2viPcWMXf
— Press Trust of India (@PTI_News) October 29, 2023STORY | Seven members of a family were killed while two others were injured in a head-on collision between a car and a truck in Rajasthan's Hanumangarh district, police said on Sunday. The accident occurred on Saturday night when the family was returning home from a function.… pic.twitter.com/i2viPcWMXf
— Press Trust of India (@PTI_News) October 29, 2023
ఎంపీ హనుమాన్ బేనివాల్ సంతాపం
ఈ ఘటనపై ఎంపీ హనుమాన్ బేనివాల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా భగవంతుడిని ప్రార్థించారు.
-
हनुमानगढ़ जिले में कार और ट्रोले की टक्कर से हुए भीषण सड़क हादसे के कारण हुई जनहानि अत्यंत दु:खद खबर है ! परमात्मा दिवंगत जनों की आत्मा को शांति प्रदान करें व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें !
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">हनुमानगढ़ जिले में कार और ट्रोले की टक्कर से हुए भीषण सड़क हादसे के कारण हुई जनहानि अत्यंत दु:खद खबर है ! परमात्मा दिवंगत जनों की आत्मा को शांति प्रदान करें व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें !
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) October 28, 2023हनुमानगढ़ जिले में कार और ट्रोले की टक्कर से हुए भीषण सड़क हादसे के कारण हुई जनहानि अत्यंत दु:खद खबर है ! परमात्मा दिवंगत जनों की आत्मा को शांति प्रदान करें व घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें !
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) October 28, 2023
ఆరుగురు కూలీలు మృతి..
బంగాల్లోని ఖరగ్పుర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పికప్ వ్యాన్లో పువ్వులు లోడ్ చేస్తుండగా సిమెంట్ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమ మేదినీపుర్ జిల్లా.. ఖరగ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురమలా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను రక్షించి తదుపరి చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మిడ్నాపుర్ ఆస్పత్రికి తరలించారు.
"శనివారం ఉదయం కార్మికులు.. పికప్ వ్యాన్లో పూలు లోడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో 10-12 మంది కార్మికులు.. పువ్వులు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అకస్మాత్తుగా సిమెంట్ లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు" అని పోలీసులు తెలిపారు.
Karnataka Accident Today : లారీని ఢీకొన్న టాటా సుమో.. 13 మంది ఏపీ వాసులు మృతి