అగ్ని ప్రమాదాలను నిరోధించే చర్యల్లో భాగంగా రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్కు అవకాశం ఇవ్వకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. ఆ సమయంలో ఛార్జింగ్ పాయింట్లు పనిచేయకుండా పశ్చిమ రైల్వే రెండు వారాల క్రితమే మార్పులు చేసింది.
నిజానికి రాత్రిపూట ఛార్జింగ్ కు వీల్లేకుండా చేయాలని 2014లోనే రైల్వే భద్రత కమిషనర్ ఆదేశించారని ఒకరు వెల్లడించారు. దానిపై రైల్వేబోర్డు తాజాగా అన్ని జోన్లకు మరోసారి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అవసరానికి మించి చార్జింగ్ చేస్తుండడం వల్ల అనేకసార్లు స్వల్పస్థాయిలోనైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.