ఒక బ్యాచ్ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ వేయడం వల్ల ఛత్తీస్‌గఢ్ రాయ్‌గఢ్‌లోని 90 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణమైన 'కొవిఫోర్ హెచ్‌సీఎల్ 21013' బ్యాచ్ నుంచి ఎటువంటి ఇంజెక్షన్ వాడవద్దని రాష్ట్ర ఔషధ విభాగం ఆదేశించింది.
ఈ బ్యాచ్ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఏప్రిల్ 28న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాయ్‌గఢ్‌కు తీసుకొచ్చారు. జిల్లాలో మొత్తం 120 మంది రోగులకు ఈ బ్యాచ్ నుంచి ఇంజెక్షన్లు ఇవ్వగా.. 90 మందికి దుష్ప్రభావాలు కలిగాయి.
ఇదీ చదవండి: మూడో దశ వ్యాక్సినేషన్ కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు