ETV Bharat / bharat

దూకుడు పెంచిన రాహుల్​- ఆ రాష్ట్రాల్లో వరుస ప్రచారాలు - రాహుల్ గాంధీ ప్రచార చిత్రాలు

త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. కాలికట్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. త్వరలో బంగాల్​లోనూ కాంగ్రెస్​ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

Rahul to campaign in Kerala, Tamil Nadu this week
మరోసారి కేరళ, తమిళనాడు ప్రచారానికి రాహుల్​
author img

By

Published : Feb 21, 2021, 9:03 PM IST

Updated : Feb 21, 2021, 11:11 PM IST

కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాలికట్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు రాహుల్​ గాంధీ. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

కేరళలో 22, 23వ తేదీల్లో కాంగ్రెస్​ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నారు రాహుల్​. రెండురోజుల పర్యటనలో భాగంగా.. కేరళ ​ప్రతిపక్ష నేత రమేష్​ చెన్నితల చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో ఆయన​ పాల్గొననున్నారు. ప్రచారవేగాన్ని పెంచిన రాహుల్​.. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో పలుమార్లు పర్యటించారు.

ప్రాంతీయ సమస్యలే అజెండా..

తన ఎన్నికల ప్రచారంలో రాహుల్..​ ప్రాంతీయ సమస్యలను ఎత్తిచూపనున్నారు. ఇంతకుముందు తమిళనాడు పర్యటన సందర్భంగా భావోద్వేగాలతో ముడిపడిన సున్నిత అంశాలను ఆయన​ ప్రస్తావించారు. ప్రధానంగా భాషా సమస్యలు సహా.. నూతన విద్యావిధానంపై భాజపాను విమర్శించారు. అంతకుముందు తమిళనాడు పర్యటనలో.. నూతన విద్యా విధానం, భాషా సమస్యపై భాజపాపై విమర్శలు గుప్పించారు. అసోంలో సీఏఏను ప్రస్తావించిన రాహుల్​.. భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

బంగాల్​లో విడిగానే..?

అసోంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని రాహుల్​ ప్రారంభించారు. త్వరలో బంగాల్​లోనూ కాంగ్రెస్​ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే బంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు కలసి నిర్వహించే సంయుక్త ర్యాలీకి రాహుల్​ హాజరవుతారా? లేదా కాంగ్రెస్​ ప్రచారాన్ని రాహుల్ విడిగా​ ప్రారంభిస్తారా అనేదానిపై స్పష్టత లేదు. అయితే.. ఆరోజు రాహుల్​ తమిళనాడు ప్రచారంలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు కేరళలో రాహుల్​ గాంధీ ప్రచార ర్యాలీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.​ ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారని గహ్లాత్​కు మంచి పేరుంది.

ఇక కేరళ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్​ అన్వర్ రాష్ట్రానికి చేరుకున్నారు. సుమారు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తారిఖ్​ పర్యటించి, క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు.

ఇదీ చదవండి: పెట్రో ధరలు తగ్గించాలని మోదీకి సోనియా లేఖ

Last Updated : Feb 21, 2021, 11:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.