ETV Bharat / bharat

Rahul On Upcoming Elections : 'తెలంగాణలో అధికారం కాంగ్రెస్​దే!.. ఆ మూడు రాష్ట్రాల్లో కూడా..' - telangana election 2023 rahul gandhi comments

Rahul on Upcoming Elections : బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాహుల్​ గాంధీ. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశం తెచ్చిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

rahul-on-upcoming-elections-fires-on-bjp

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 12:37 PM IST

Updated : Sep 24, 2023, 1:24 PM IST

Rahul on Upcoming Elections : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్​ గాంధీ. మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో మాత్రం కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్​లో కూడా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఆదివారం దిల్లీలోని అశోకా హోటల్​లో జరిగిన 'ది కాంక్లేవ్​ రెండో ఎడిషన్​' చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఎన్నికల నుంచి తాము చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు రాహుల్​ గాంధీ. తమ ఉద్దేశ్యాన్ని ప్రజలు చెప్పకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఒకే దేశం-ఒకే ఎన్నికపై స్పందించిన రాహుల్​.. ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ పన్నిన ఓ వ్యూహంగా దాన్ని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌యే ముందుంజలో ఉందన్న రాహుల్​.. అక్కడ ఆ పార్టీ పూర్తి క్షీణించిందన్నారు.

  • We feel very strongly that Indian women are not participating in the political system the way they should be. The single biggest act to help them participate in politics was carried out by Congress party, i.e., 33% reservation in Panchayati Raj which was a game changer.

    Also,… pic.twitter.com/MiHVGmne4E

    — Congress (@INCIndia) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొందరి వద్దే డబ్బంతా పోగైంది. అసమానతలు, భారీ స్థాయిలో నిరుద్యోగం, ఓబీసీలు, గిరిజనులపై బీజేపీ పక్షపాతం వంటివి ప్రధానంగా ఉన్నాయి. కానీ బీజేపీ ఎప్పుడు వీటి ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయదు. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. దేశం పేరు మారుద్దామని అంటోంది" అని బీజేపీపై రాహుల్​ గాంధీ మండిపడ్డారు. వాటిని తాము అర్థం చేసుకున్నామని, అలా చేయనివ్వమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్న రాహుల్​.. 2024 ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యానికి గురవుతుందని పేర్కొన్నారు.

  • #WATCH | Delhi: On One Nation, One Election, Congress leader Rahul Gandhi says, "It's one of the BJP's distraction strategies... The main issues in India are concentration of wealth, huge inequality in wealth, massive unemployment, huge unfairness towards the lower caste, towards… pic.twitter.com/4YxoimO0i6

    — ANI (@ANI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తాము కులాల వారీ లెక్కలు అడుగుతుంటే ఎంపీలు బిధూరి, నిషికాంత్ దుబేల ద్వారా బీజేపీ వివాదాస్పద ప్రకటనలు చేయిస్తోందని రాహుల్​ మండిపడ్డారు. సమస్యలపై ప్రజల్లో చర్చ జరగకుండా చూస్తోందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రజా సమస్యలపై కాకుండా వివాదాస్పద విషయాలపై చర్చ ఉండేలా ప్రయత్నించిందన్న రాహుల్.. దాని తమ పార్టీ సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడిందని తెలిపారు. ఈ మధ్య జరిగిన తన లద్దాఖ్​ పర్యటనను కూడా రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.

దేశం పేరును ఇండియా నుంచి భారత్​ మార్చాలనుకున్నారు..
మహిళా రిజర్వేషన్​ బిల్లుకు జనాభా గణనకు ఎలాంటి సంబంధం లేదన్నారు రాహుల్​. "దేశం పేరును ఇండియా నుంచి భారత్​ మార్చాలనుకున్నారు. కానీ ఆ చర్య ప్రజలకు ఇష్టం లేదు. ఆ విషయం తెలుసుకున్న బీజేపీ వెనక్కి తగ్గింది. దీంతో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది" అని రాహుల్​ ఆరోపించారు. చట్టసభల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు​ తక్షణమే అమలు కావాలని ఆయన డిమాండ్ చేశారు.

Rahul Gandhi On Modi : 'మోదీజీ.. కుల గణనకు భయమెందుకు? మహిళా రిజర్వేషన్ల కోసం పదేళ్లు ఆగాలా?'

Rahul Gandhi Vs Amit Shah On OBCs : రాహుల్​ వర్సెస్ షా.. ఓబీసీలకు ప్రాధాన్యంపై డైలాగ్ వార్

Last Updated : Sep 24, 2023, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.