ETV Bharat / bharat

WFI ఎన్నికల వివాదం- రెజ్లర్లను కలిసిన రాహుల్- సరదాగా కుస్తీకి సై అంటూ! - డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్ష ఎన్నిక వివాదం

Rahul Meets Wrestlers : భారత రెజ్లింగ్​ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల చుట్టూ వివాదం నడుస్తున్న వేళ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ రెజ్లర్లను కలిశారు. కాసేపు వారితో ముచ్చుటించి సరదాగా కుస్తీ పట్టారు.

Rahul Meets Wrestlers Today
Rahul Meets Wrestlers
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 12:47 PM IST

Updated : Dec 27, 2023, 1:56 PM IST

Rahul Meets Wrestlers : బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య-డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ పలువురు మల్లయోధులు అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారిని బుధవారం కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఛరా గ్రామంలో వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లిన ఆయన రెజ్లర్లతో మాట్లాడారు. కొద్ది సేపు వారితో మట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ గాంధీ తమ రెజ్లింగ్ రొటీన్‌ను చూడటానికి మాత్రమే వచ్చారని, ఆయన కూడా సరదాగా మల్లయోధులతో కుస్తీ తలపడ్డారని ప్రముఖ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తెలిపాడు

  • #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestling Coach Virendra Arya says, "Nobody told us that he's coming. We were practicing here and he came all of a sudden...He reached here around 6:15 am...He did… pic.twitter.com/j0eLrEz1zX

    — ANI (@ANI) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'రాహుల్​ ఏం చేయగలరు?'
ఝజ్జర్​ జిల్లా ఛరా గ్రామంలోని వీరేందర్​ ఆర్య అఖారాలో రెజర్లను రాహుల్ కలిసిన అనంతరం రెజ్లింగ్​ కోచ్​ వీరేందర్​ ఆర్య మాట్లాడాడు. 'రాహుల్​ గాంధీ వస్తున్నారని మాకు ఎటువంటి సమాచారం లేదు. మేం ప్రాక్టీస్​ చేస్తుండగా ఆయన అకస్మాతుగా వచ్చారు. ఉదయం 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన ఇక్కడకు వచ్చారు. మాతో కలిసి కాసేపు వ్యాయామం చేశారు. వ్యాయామం, క్రీడ గురించి చర్చించారు. క్రీడల గురించి ఆయనకు మంచి అవగాహన ఉంది. నేషనల్ ఈవెంట్స్ జరగనున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యతో ఏం చేయగలము? అయినా ఈ విషయమై రాహుల్​ గాంధీ ఏం చేయగలరు? ఏదైనా చేస్తే ప్రభుత్వమే చేయగలదు' అని కోచ్​ వీరేందర్​ ఆర్య అభిప్రాయపడ్డారు.

అవార్డులు వెనక్కి
WFI Crisis : ఇటీవల జరిగిన రెజ్లింగ్ సమాఖ్య- డబ్ల్యూఎఫ్​ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌సింగ్‌ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ పరిణామం రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే సంజయ్‌ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేశారు చాలామంది రెజ్లర్లు. దీనిని నిరసిస్తూ ఒక్కొక్కరుగా తాము సాధించిన పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సాక్షి మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా, తన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రకటించారు. బజ్‌రంగ్‌ పునియా, వీరేందర్‌ యాదవ్‌ పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చేశారు.

'క్రీడారాజకీయాలకు దూరంగా ఉంటాను'
కొత్తగా ఎన్నికైన సమాఖ్య పాలక మండలిపై కేంద్ర క్రీడా శాఖ వేటువేసింది. అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలను హడావుడిగా నిర్వహించేందుకు సిద్ధం కావడాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాను రెజ్లింగ్‌ వ్యవహారాలకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ఎంపీ బ్రిజ్‌ భూషణ్ వెల్లడించారు. ఇక నుంచి క్రీడారాజకీయాలకు తాను దూరంగా ఉంటానని పేర్కొన్నారు.

14రాష్ట్రాలు, 6200 కి.మీ- రాహుల్​ 'భారత్ న్యాయ్ యాత్ర'- ఎప్పటినుంచంటే?

ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు ​- దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్!​

Last Updated : Dec 27, 2023, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.