ETV Bharat / bharat

కర్ణాటకలో కాంగ్రెస్​కు 150 సీట్లు తేవాలి: రాహుల్ - రాహుల్ కర్ణాటక పర్యటన

rahul karnataka tour: బెంగుళూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భాజపా సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటకదేనని ఆరోపించారు. కాంగ్రెస్ కోసం కష్టపడేవారికే వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని అన్నారు. పార్టీ 150 సీట్లు సాధించేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని నాయకులకు సూచించారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Apr 2, 2022, 6:53 AM IST

rahul karnataka tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం బెంగుళూరులో పర్యటించారు. పార్టీ నేతలు నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 150 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కోసం అవిశ్రాంతంగా క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు గుర్తింపు ఇచ్చేలా నిర్ణ‌యాలు ఉంటాయని రాహుల్ తెలిపారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పనితీరు ఆధారంగానే వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని తెలిపారు.

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా.. తన పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా తప్పిదాలను ఎండగట్టే దిశగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎన్నికల ర్యాలీల్లో అవినీతి గురించి మాట్లాడతారని.. అయితే దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటకలోనే ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. అది భాజపా ఆధ్వర్యంలోనే నడుస్తోందని అన్నారు. అవినీతిపై మోదీ మాట్లాడటం ఒక పెద్దజోక్ అని విమర్శించారు. నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం దేశం ముందున్న అతిపెద్ద సమస్యలని అన్నారు. మోదీ ప్రభుత్వం నేడు యువతకు ఉద్యోగాలు కల్పించే స్థితిలో లేదని అన్నారు.

ఇదీ చదవండి: రాజ్యసభలో భాజపాకు 100 సీట్లు.. చరిత్రలో తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.