పుదుచ్చేరి పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమకు ఏం జరుగుతుందో అని భయపడకుండా పౌరులు న్యాయం పొందలేకపోతున్నారని అన్నారు. ఓవైపు జర్నలిస్టులు ప్రాణభయంతో ఉంటే.. ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్లో బిల్లులను ఆమోదిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన తమలాంటి నేతలకు.. లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంలేదని చెప్పారు. మోదీ తనని తాను ప్రధానిగా కాకుండా.. ఓ రాజులా భావించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపు ఐదేళ్ల పాటు పనిచేయకుండా చేశారని మండిపడ్డారు రాహుల్. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.
"ప్రజాతీర్పుకు ప్రధానమంత్రి విలువ ఇవ్వలేదు. మీ(ప్రజలు) ఓట్లకు విలువ లేదని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా మోదీ పదేపదే సందేశం ఇచ్చారు. మీ కలలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేశారు. అన్ని ప్రభుత్వ సంస్థల మాదిరిగానే .. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
రాజీవ్ మరణంపై..
పర్యటన సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన రాహుల్.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతిపై మాట్లాడారు. తన తండ్రి మరణం తీవ్ర మనోవేదన కలిగించిందని చెప్పారు. ఆయన దూరమైన క్షణాలు ఎంతో బాధాకరమైనవని చెప్పారు రాహుల్. అయితే ఈ విషయంపై ఎవరిపైనా కోపం, ద్వేషం లేవని స్పష్టం చేశారు. ఆయనను హత్య చేసినవారిని క్షమించానన్నారు.
రాజీవ్‌ను ఎల్టీటీఈ(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) వర్గానికి చెందినవారు హత్య చేయడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
-
#WATCH | Congress leader Rahul Gandhi on being asked about his father's death, in Puducherry. He says, "I don't have anger or hatred towards anybody. I lost my father and it was a difficult time for me. I felt tremendous pain." pic.twitter.com/YVfZFFyfKy
— ANI (@ANI) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Congress leader Rahul Gandhi on being asked about his father's death, in Puducherry. He says, "I don't have anger or hatred towards anybody. I lost my father and it was a difficult time for me. I felt tremendous pain." pic.twitter.com/YVfZFFyfKy
— ANI (@ANI) February 17, 2021#WATCH | Congress leader Rahul Gandhi on being asked about his father's death, in Puducherry. He says, "I don't have anger or hatred towards anybody. I lost my father and it was a difficult time for me. I felt tremendous pain." pic.twitter.com/YVfZFFyfKy
— ANI (@ANI) February 17, 2021
"నాకు ఎవరిమీదా కోపం, ద్వేషం లేదు. మా నాన్నను కోల్పోయాను. అది నాకు అత్యంత కష్టకాలం. గుండెను కోసి బయటకు లాగినట్లు అనిపించేది. చాలా మనోవేదన అనుభవించాను. కానీ నాకు కోపం లేదు. నేను క్షమించేశా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
రాజీవ్‌తో పాటు తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కోల్పోవడంపై మరో విద్యార్థి ప్రశ్నించగా.. హింస.. మన నుంచి దేన్నీ లాక్కోలేదని అన్నారు రాహుల్. రాజీవ్ గాంధీ తనలో సజీవంగా ఉన్నారని, తనలో నుంచి ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: రాజకీయ సంక్షోభం వేళ పుదుచ్చేరికి రాహుల్