ETV Bharat / bharat

'బడా వ్యాపారుల కోసమే మోదీ పాలన' - వయనాడ్

రైతుల హక్కులను కాలరాసేలా.. బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ మరోమారు ధ్వజమెత్తారు. కేరళ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత నియోజకవర్గం వయనాడ్​లో పర్యటిస్తున్న రాహుల్​ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిచారు.

rahul gandhui speech at kerala criticizes modi
'వ్యాపారుల కోసమే మోదీ పాలన'
author img

By

Published : Jan 28, 2021, 1:10 PM IST

బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని మరోమారు తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​ గాంధీ. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు చేరుకున్నారు రాహుల్​.

లాక్​డౌన్​లో భారత బిలియనీర్ల సంపద రెట్టింపైందన్న ఆక్స్​ఫామ్ నివేదికను మీడియాతో పంచుకున్న రాహుల్​.. కొందరు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ప్రధాని దేశాన్ని నడుపిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం సహా.. ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. దేశ పారిశ్రామిక రంగం ఏకఛత్రాధిపత్యం దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు​. కేవలం ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలు దేశీయ పరిశ్రమలను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసునన్నారు.

భూసేకరణ చట్టం చేశాం: రాహుల్

ఉత్తర్​ప్రదేశ్​లోని భట్టాపరశౌల్ ప్రాంతంలో రైతుల భూమిని లాక్కున్నప్పుడే దేశంలో అన్నదాతలపై దాడులకు అవకాశం ఉందని గ్రహించామన్నారు రాహుల్. ఇదొక పెద్ద సమస్యగా మారకముందే కాంగ్రెస్ పార్టీలో చర్చించామని.. దాని ఫలితంగానే 2011లో భూసేకరణ చట్టాన్ని ఆమోదించామని తెలిపారు. ఏళ్లనాటి బ్రిటీష్ చట్టాలను రద్దు చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చే చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక ఈ బిల్లు అమలు కాకుండా చేసిన ప్రయత్నాలను పార్లమెంటులో తిప్పికొట్టామని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: 'దావోస్'​ సదస్సులో నేడు మోదీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.