Rahul Gandhi Vaccine Twitter: దేశంలో వ్యాక్సిన్ పంపిణీపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటికీ చాలా మందికి టీకా అందలేదని ఆరోపించారు. దేశంలో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఎప్పుడు అందిస్తారని ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
"దేశంలో ఇప్పటికీ 62 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. గత ఏడు రోజులుగా సరాసరి 58 లక్షల డోసుల పంపిణీ జరుగుతోంది. ఇలా అయితే.. డిసెంబర్ నాటికి కేవలం 42 శాతం మందికి మాత్రమే టీకా అందుతుంది. దీనిని 61 లక్షలకు పెంచాల్సి ఉంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Rahul Gandhi News: కేంద్ర ప్రభుత్వ టీకా ప్రణాళికపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. టీకా పంపిణీ వేగాన్ని పెంచాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: India Corona cases: 575 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు