రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో(Rafale deal) అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ మరోమారు ఆరోపణలు చేశారు. నిజం ఎప్పటికీ దాగదన్నారు. ప్రముఖ మీడియా సంస్థ 'మీడియా పార్ట్'కు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ యాన్ ఫిలిఫైన్ భారత్‌లోని ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
-
Truth can’t be silenced. Unlike ‘Modia’.#RafaleScam pic.twitter.com/LPuSvyhlKQ
— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Truth can’t be silenced. Unlike ‘Modia’.#RafaleScam pic.twitter.com/LPuSvyhlKQ
— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021Truth can’t be silenced. Unlike ‘Modia’.#RafaleScam pic.twitter.com/LPuSvyhlKQ
— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021
"2018లో రఫేల్‌కు సంబంధించి డిక్షరేషన్ జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ మాకు చెప్పారు. భారత ప్రభుత్వం ఆఫ్‌సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను ప్రధాన భాగస్వామిగా చేర్చుకోమని డసో ఏవియేషన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. నిజానికి అది ప్రతిపాదన కాదు. అంతకు మించి. రిలయన్స్‌ను తీసుకోవాల్సిందే అనే భావనలో చెప్పారు."
- యాన్ ఫిలిఫైన్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ 'మీడియాపార్ట్' ఇప్పటికే ఓ కథనాన్ని ప్రచురించింది. రూ.59 వేల కోట్లు విలువ చేసే ఈ ఒప్పందం విషయంలో దర్యాప్తు జరిపేందుకు ఓ న్యాయమూర్తిని కూడా నియమించినట్లు తెలిపింది.
ఇప్పటికైనా తెలుసుకోండి...
రఫేల్ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగినట్లు ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షురాలి మాయావతి అన్నారు. 'భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందంలో అవినీతి జరిగిందని ఫ్రాన్స్ ప్రభుత్వం దానిపై న్యాయవిచారణకు ఆదేశించింది. ప్రజల్లో ఇది బాగా చర్చజరుగుతుంది. ఇకనైనా కేంద్రం దృష్టిసారించాలి.'అని మాయావతి హిందీలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Rafale: రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు!