Rahul Gandhi Treatment : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి వారం రోజుల పాటు కేరళ.. మలప్పురం జిల్లాలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో ఆయుర్వేద చికిత్స చేయించుకోనున్నారని సమాచారం. ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ పీఎం మాధవన్ కుట్టి వారియర్ పర్యవేక్షణలో రాహుల్‌కు చికిత్స జరగనుందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ జూలై 29వ తేదీ వరకు ఆర్యవైద్యశాలలోనే ఉండనున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా వైద్యశాలలో ఉంటారని తెలిసింది. మరో రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్తారని సమాచారం.
Rahul Gandhi Oommen Chandy : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీకి నివాళులు అర్పించడానికి రాహుల్ గురువారం సాయంత్రం కేరళ చేరుకున్నారు. అనంతరం కొట్టక్కల్ వెళ్లాల్సి ఉంది. కానీ చాందీ అంత్యక్రియలు ఆలస్యం కావడం వల్ల అక్కడే ఉండిపోయారు. గురవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో చాందీకి కడసారి వీడ్కోలు పలికారు రాహుల్.
Kottakkal Arya Vaidya Sala Kottakkal : ఆయుర్వేద చికిత్సలో 116 ఏళ్ల చరిత్ర కలిగిన కొట్టక్కల్ ఆర్య వైద్యశాల.. రోగులకు శాస్త్రీయ ఆయుర్వేద మందులు, చికిత్స, థెరపీ సేవలను అందిస్తుంది. ఈ వైద్యశాలలో చికిత్స చేయించుకోవడానికి విదేశాల నుంచి కూడా రోగులు వస్తారు. అయితే భారత్ జోడో యాత్ర సమయంలో తనకు తీవ్రమైన మోకాళ్ల నొప్పులున్నాయని రాహుల్ వెల్లడించారు. అయితే, రాహుల్ ఏ ఆరోగ్య సమస్యకు.. చికిత్స చేయించుకోనున్నారనే విషయంపై స్పష్టత లేదు.
అయితే కేరళలో చాలా మంది 'కర్క్కడక చికిత్స' అనే చికిత్సా విధానాన్ని అనుసరిస్తారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం 'కర్క్కడక' అంటే ఒక నెల పేరు. శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి చేసే ఆయుర్వేద చికిత్సలకు ఇది అనువైన కాలంగా పరిగణిస్తారు. ఆయుద్వేదం ప్రకారం వర్షకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఈ సమయంలోనే 'కర్క్కడక' విధానం ద్వారా చికిత్స చేస్తారు.
రాహుల్ వ్యవసాయం.. పొలంలోకి దిగి..
Rahul Gandhi Agriculture : ఇటీవల హిమాచల్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. మార్గమధ్యలో మహిళలతో కలిసి వరినాట్లు వేశారు. పొలంలోకి దిగి సరదాగా రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ ఎక్కి పొలం సైతం దున్నారు రాహుల్ గాంధీ. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.