ETV Bharat / bharat

Rahul Gandhi Speech at Khammam Meeting : 'కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతులకు రూ.4000 పింఛన్'

Khammam Congress Public Meeting : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు రూ.4000 పింఛన్​ ఇస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అలాగే ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల పోటీ కాంగ్రెస్‌కు, బీజేపీ బీ టీమ్‌కు మాత్రమేనని రాహుల్‌ గాంధీ అన్నారు. బీజేపీ బీ టీమ్‌.. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పత్తా లేకుండా పోయిందని విమర్శించారు.

Rahul Gandhi Speech at Khammam Meeting
Rahul Gandhi Speech at Khammam Meeting
author img

By

Published : Jul 2, 2023, 7:51 PM IST

Updated : Jul 2, 2023, 9:20 PM IST

'కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతులకు రూ.4000 పింఛన్'

Rahul Gandhi speech at Khammam Congress meeting : ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఏపీలోని గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్నారు. అక్కడ ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టగా.. ఓపేన్‌ టాప్‌ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. సీఎం కేసీఆర్‌వైపు ధనికులు, కాంట్రాక్టర్లు ఉన్నారని విమర్శించారు.

కాంగ్రెస్ వైపు పేదలు, రైతులు, అన్ని వర్గాలు ఉన్నాయని ధీమ వ్యక్తం చేశారు. తెలంగాణలో మొదట్లో ముక్కోణ పోటీ అనుకున్నారని.. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పత్తా లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్‌కు, బీజేపీ బీ టీమ్‌కు మాత్రమేనని అన్నారు. బీజేపీ బీటీమ్‌ను, బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఓడిస్తుందని ధీమ వ్యక్తం చేశారు.

"ఇటీవల విపక్షాల సమావేశం జరిగింది. విపక్షాల భేటీకి బీఆర్‌ఎస్‌ వస్తుందా అని అడిగాం. బీఆర్‌ఎస్‌ భేటీకి వస్తే మేం హాజరుకాబోమని చెప్పాం. కేసీఆర్‌ అవినీతికి మోదీ ఆశీస్సులు ఉన్నాయి. కేసీఆర్‌ సర్కారు స్కామ్‌లన్నీ మోదీకి తెలుసు. స్కామ్‌ల వల్లే బీఆర్‌ఎస్‌.. బీజేపీకి బీ టీమ్‌గా మారింది"- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

కాంగ్రెస్‌ వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించిందని అన్నారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు రూ.4000 పింఛను ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అలాగే ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేస్తామన్నారు. కర్ణాటకలో అవినీతి సర్కారును కాంగ్రెస్‌ ఓడించిందని రాహుల్‌ అన్నారు. ఆ రాష్ట్రంలో తమ పార్టీకి అండగా పేదలు నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

"కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు రూ.4000 పింఛన్ ఇస్తాం. ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేస్తాం. కర్ణాటకలో అవినీతి సర్కారును కాంగ్రెస్‌ ఓడించింది. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్‌ గెలుస్తుంది."- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అంతకు ముందు సభ వేదిక వద్దకు చేరుకున్న రాహుల్‌ గంధీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు సన్మానించారు. ప్రజాగాయకుడు గద్దర్‌.. రాహుల్‌ను అలింగనం చేసుకొని ముద్దు పెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కను భుజం తట్టి రాహుల్‌గాంధీ అభినందించారు. పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్న భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 2, 2023, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.