ETV Bharat / bharat

'అర్థం లేని మాటలతో కొవిడ్​ను ఎదుర్కోలేం' - రణ్​దీప్ సూర్జేవాలా

నెలకోసారి అర్థం లేని మాటలు మాట్లాడి కొవిడ్​ సంక్షోభాన్ని ఎదుర్కోలేమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ మన్​కీ బాత్​ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యానించారు. అటు.. మోదీ ఏడేళ్ల పాలనపై కాంగ్రెస్​ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

rahul gandhi
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
author img

By

Published : May 30, 2021, 5:58 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'మన్​ కీ బాత్' కార్యక్రమంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నెలకోసారి అర్థం లేని మాటలు మాట్లాడుతూ కొవిడ్​ను జయించలేం అని ట్వీట్ చేశారు.

"కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే.. సరైన ఉద్దేశం, సరైన విధానం, సంకల్పం ఉండాలి. నెలకోసారి అర్థంలేని మాటలు మాట్లాడటం కాదు."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

వ్యాక్సినేషన్​కు సరైన వ్యూహం లేనందునే కొవిడ్ సెకండ్​ వేవ్​ వచ్చిందని రాహుల్​ గాంధీ దుయ్యబట్టారు.

77వ మన్​కీ బాత్​ కార్యక్రమంలో ఆదివారం మోదీ మాట్లాడిన నేపథ్యంలో రాహుల్​ ట్వీట్​కు ప్రాధాన్యం ఏర్పడింది.

అంతటా లోపాలే..

మోదీ ఏడేళ్ల పాలనను ఉద్దేశించి కాంగ్రెస్​ నేతలు విమర్శలు చేశారు. ప్రధాని.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. అది దేశ ప్రజలకే ప్రమాదమని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం చేసిన తప్పులను ఏడు పాయింట్ల రూపంలో ఎత్తిచూపారు. ఈ మేరకు 'భారత్ మాతాకీ కహానీ' పేరుతో 4 నిమిషాల వీడియో షేర్ చేశారు.

గత ఏడేళ్లుగా ప్రజలను మోసం చేస్తు మోదీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​​దీప్ సూర్జేవాలా అన్నారు. ప్రస్తుతం దేశం ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎందుకుందని ప్రశ్నించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

ప్రజలకు ఇవ్వడానికి నరేంద్ర మోదీ దగ్గర ఏమీ లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్​ అన్నారు. 'ప్రజలు అంబానీ, టాటా, అదానీ కావాలని ఆశించట్లేదు. వారికి కనీస అవసరాలైన.. కూడు, గూడు, బట్ట అందిస్తే చాలు' అని అన్నారు.

ఇదీ చదవండి:Mann Ki Baat: 'సబ్​కా సాత్​, వికాస్​, విశ్వాస్​ మంత్రంతో ముందుకు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.