కరోనా టీకాల(Corona vaccines) కొరతను ఉద్దేశించి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పలు రాష్ట్రాల్లో టీకాలు అందుబాటులో లేవని ఆరోపించారు. మాటలే గానీ.. చేతల్లేవని కేంద్రంపై ధ్వజమెత్తారు. దిల్లీ సహా పలు రాష్ట్రాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న ఓ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మాటలే ఉన్నాయి.. టీకాల్లేవు" అని రాహుల్ ట్వీట్ చేశారు. 'టీకాలు ఎక్కడా?' అని ప్రశ్నించారు.
తప్పుడు వాగ్దానాలు..
వ్యాక్సినేషన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కూడా విమర్శలు గుప్పించారు. డిసెంబర్ నాటికి వయోజనులందరికీ టీకా పంపిణీ చేస్తామని కేంద్రం తప్పుడు వాగ్దానాలు చేసిందని దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందన్నారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ కలకలం- బలగాలు అప్రమత్తం