ETV Bharat / bharat

'నిరసన చేస్తే దేశద్రోహులు.. వారేమో స్నేహితులు' - మోదీ సర్కార్​పై రాహుల్​ విమర్శలు

అసమ్మతి గళం వినిపిస్తున్న రైతులు, విద్యార్థులు, పౌరులను దేశ వ్యతిరేకులుగా మోదీ సర్కార్​ చిత్రీకరిస్తుందని కాంగ్రెస్​ నేత రాహుల్​ ఆరోపించారు. సూటుబూటు వ్యాపారులే మోదీ ప్రభుత్వానికి స్నేహితులుగా కనిపిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Rahul Gandhi
'నిరసన చేస్తే దేశద్రోహులు.. వారేమో స్నేహితులు'
author img

By

Published : Dec 15, 2020, 11:20 AM IST

మోదీ సర్కార్​పై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ధ్వజమెత్తారు. అసమ్మతి స్వరం వినిపించినవారిపై కేంద్రం చేస్తోన్న ఎదురుదాడిని తప్పుబట్టారు. ఈ మేరకు ట్విట్టర్​లో పదునైన విమర్శలు సంధించారు.

rahul
రాహుల్​ ట్వీట్

"మోదీ ప్రభుత్వం దృష్టిలో అసమ్మతి స్వరం వినిపించే విద్యార్థులు దేశద్రోహులు. ఆందోళన చేసే పౌరులు అర్బన్​ నక్సల్స్​. వలస కార్మికులు కరోనా స్ప్రెడర్లు. అత్యాచార బాధితులు అంటే లెక్కలేదు. నిరసన చేస్తోన్న రైతులు ఖలిస్థానీలు. కానీ సూటుబూటు వ్యాపారులు మాత్రం ప్రాణ స్నేహితులు"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

మోదీ సర్కార్​ ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలు, ఆర్థిక పాలసీలపై రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సాగు చట్టాలపై నిరసన చేస్తూ మరణించిన రైతులపై ఆవేదనతో ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.