ETV Bharat / bharat

''ఎన్నికల ఆఫర్'​ ముగియనుంది.. పెట్రోల్ ట్యాంక్​లు నింపుకోండి' - ఎన్నికలు

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందని అన్నారు రాహుల్ గాంధీ. 'ఎన్నికల ఆఫర్'​ త్వరలోనే ముగియనుందని ఎద్దేవా చేశారు. ప్రజలు పెట్రోల్ ట్యాంక్​లను ఫుల్ చేసుకోవాలని సూచించారు.

rahul gandhi over fuel price hike
rahul gandhi
author img

By

Published : Mar 5, 2022, 7:10 PM IST

Rahul Gandhi: రాబోయే పెట్రోల్​ ధరల పెంపును ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజలు వెంటనే తమ పెట్రోల్ ట్యాంక్​లను నింపుకోవాలని సూచించారు. 'ఎలక్షన్ ఆఫర్'​ త్వరలోనే ముగియనుందంటూ ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ప్రచారం శనివారంతో ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు రాహుల్.

rahul gandhi over fuel price hike
రాహుల్ ట్వీట్

"వెంటనే మీ పెట్రోల్ ట్యాంకులను ఫుల్​ చేసుకోండి. మోదీ ప్రభుత్వ ఎన్నికల ఆఫర్​ త్వరలో ముగియనుంది." అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో పెట్రో ధరల పెంపును నిలిపివేసి, పోలింగ్ ముగియగానే భాజపా సర్కారు ధరలు పెంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది.

ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉత్తర్​ప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మార్చి 7తో ముగుస్తాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చూడండి: ముగిసిన యూపీ ప్రచారం.. విపక్షాలపై మండిపడ్డ మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.