దిల్లీలో రైతుల ఆందోళన 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అన్నదాతలు ఆందోళన చేపట్టి మూడు నెలలు దాటినా కేంద్రం చట్టాలను రద్దు చేయకపోవడంపై మండిపడ్డారు. విత్తనాలు నాటిన తరువాత పంటకోసం ఓపికగా చూసే రైతన్నలు.. ప్రతికూల పరిస్థితులకు భయపడబోరని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతన్నలు ఆందోళనకు కాంగ్రెస్ గతంలోనే తన మద్దతు ప్రకటించింది. ఫిబ్రవరి 11న లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాహుల్ రైతులకు మద్దతుగా తన గళం విప్పారు. నూతన సాగు చట్టాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అవి రైతులను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'ఆ లక్ష్యాలను గడువు కంటే ముందే సాధిస్తాం'