ETV Bharat / bharat

పెట్రోధరలపై రాహుల్​ వినూత్న నిరసన - పార్లమెంట్​కు సైకిల్​పై వచ్చిన రాహుల్​

భారీగా పెరిగిన ఇంధన ధరలపై కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ తన దైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్​కు హాజరయ్యేందుకు ఆయన సైకిల్​పై వచ్చారు. పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు సంబంధించిన ప్లకార్డ్​లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Rahul Gandhi rides bicycle
సైకిల్​ ఎక్కిన రాహుల్​
author img

By

Published : Aug 3, 2021, 2:28 PM IST

సైకిల్​ ఎక్కిన రాహుల్​

అంతకంతకూ పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పార్లమెంట్​కు సైకిల్​ తొక్కుతూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్​ ధర లీటరుకు రూ. 100 దాటింది. పార్లమెంట్​లో వాయిదాల పర్వం కొనసాగుతుండగా.. సభ వెలుపల ప్రతిపక్షపార్టీలు మాక్​ సెషన్​లను నిర్వహించడం ద్వారా నిరసనలను తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో అల్పాహార సమావేశం పేరుతో దిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో రాహుల్​.. 15 ప్రతిపక్షపార్టీల నాయకులతో సమావేశమయ్యారు.

"నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మనమంతా ఓ శక్తిగా ఏకం కావాలి. అప్పుడే సభలో ప్రజల వాణిని ఐక్యంగా వినిపించగలం. దీంతో అది మరింత శక్తిమంతంగా మారుతుంది. లేకపోతే భాజపా-ఆర్‌ఎస్‌ఎస్​ను ఎదుర్కోవడం చాలా కష్టమైన పని."

రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత.

ఈ సమావేశానికి కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆరెస్పీ, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్‌, తృణమూల్ కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం ఈ భేటీకి హాజరుకాలేదు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​ భారత్​లో అంతర్భాగమే.. ఇక చర్చలొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.