ETV Bharat / bharat

Rahul Gandhi Meets Railway Coolies : కూలీ నంబర్ 1.. రైల్వే పోర్టర్స్​తో రాహుల్ ముచ్చట్లు.. తలపై లగేజీ మోస్తూ..

Rahul Gandhi Meets Railway Coolies : రైల్వే కూలీలతో ముచ్చటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్​లో పనిచేస్తున్న కూలీలతో రాహుల్ మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే కూలీల యూనిఫాం ధరించి లగేజీని సైతం రాహుల్ మోశారు.

Rahul Gandhi Meets Raiway Coolies
Rahul Gandhi Meets Raiway Coolies
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 1:09 PM IST

రైల్వే కూలీలతో రాహుల్ ముచ్చట్లు

Rahul Gandhi Meets Railway Coolies : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రైల్వే కూలీలతో మమేకమయ్యారు. దిల్లీలోని ఆనంద్​విహార్​ రైల్వే స్టేషన్​ను గురువారం ఉదయం ఆకస్మాత్తుగా రాహుల్​ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రైల్వే కూలీలతో ముచ్చటించారు. నేలపై కూర్చొని రైల్వే కూలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రైల్వే కూలీల యూనిఫాం వేసుకుని తలపై లగేజీని మోశారు. ఈ విషయం బయటకు తెలియడం వల్ల రాహుల్​ను చూసేందుకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్​కు ప్రజలు భారీగా తరలివచ్చారు.

rahul gandhi meets railway coolies
లగేజీ మోస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్
rahul gandhi meets railway coolies
కూలీలతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

కాగా.. గత నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలవాలని ఉందని రైల్వే కూలీలు మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్.. గురువారం వారిని కలవడం గమనార్హం. రాహుల్​ తమను కలవడం పట్ల కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టాలను రాహుల్ విన్నారని తెలిపారు.

rahul gandhi meets railway coolies
కూలీలతో రాహుల్ సెల్ఫీ
rahul gandhi meets railway coolies
రైల్వే యూనిఫాం వేసుకున్న రాహుల్ గాంధీ

రాహుల్​.. కూలీలతో మమేకమైన వీడియోను కాంగ్రెస్ ఎక్స్​(ట్విట్టర్​)లో పోస్ట్ చేసింది. భారత్​ జోడో యాత్ర కొనసాగుతోందని పేర్కొంది. 'మహాత్మా గాంధీ ఆలోచనల స్ఫూర్తితో మాస్ లీడర్ రాహుల్ గాంధీ.. భారత్​ను ఏకం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. రాహుల్ కాన్వాయ్​ గురువారం ఉదయం దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే కూలీల బాధలు, సమస్యలను రాహుల్ విన్నారు.' అని ఎక్స్​లో రాసుకొచ్చింది.

  • जननायक राहुल गांधी जी आज दिल्ली के आनंद विहार रेलवे स्टेशन पर कुली साथियों से मिले।

    पिछले दिनों एक वीडियो वायरल हुआ था जिसमें रेलवे स्टेशन के कुली साथियों ने उनसे मिलने की इच्छा जाहिर की थी।

    आज राहुल जी उनके बीच पहुंचे और इत्मीनान से उनकी बात सुनी।

    भारत जोड़ो यात्रा जारी है.. pic.twitter.com/QrjtmEMXmZ

    — Congress (@INCIndia) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అలాగే రైల్వే కూలీలతో మమేకమవ్వడంపై సోషల్ మీడియా వేదిక ఇన్​స్టాగ్రామ్ వేదికగా రాహుల్ స్పందించారు. 'గురువారం.. దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌లో కూలీ సోదరులను కలిశాను. వారిని కలవాలని నాకు చాలా కోరికగా ఉంది. కూలీ సోదరులు నన్ను కలవాలని ప్రేమగా పిలిచేసరికి ఈ రోజు వారిని కలిశాను' అని అన్నారు.

Rahul Gandhi Bike Mechanic : ఈ ఏడాది జూన్​లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ.. బైక్​ మెకానిక్​ అవతారమెత్తారు. దిల్లీలోని కరోల్​ భాగ్​లో మెకానిక్​ షెడ్​లను సందర్శించిన ఆయన.. అక్కడ పనిచేసేవారితో మాట్లాడారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు రాహుల్. వారితో కలిసిన ఫొటోలను సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. రెంచ్​లను తిప్పి చేతుల వద్ద భారత చక్రాలను కదిలించడం నేర్చుకున్నాననే క్యాప్షన్​తో ఫొటోలను షేర్ చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Rahul Gandhi Bike Ride : స్టైలిష్ లుక్​లో రాహుల్ గాంధీ.. స్పోర్ట్స్​ బైక్​పై లద్ధాఖ్ టూర్​

Rahul Gandhi Bike Trip : 18 వేల అడుగుల ఎత్తైన రహదారిపై రాహుల్ బైక్ రైడింగ్.. వీడియో చూశారా?

Sonia Gandhi Boat Ride : నిజీన్​ సరస్సులో సోనియా బోట్​ షికార్​.. రాహుల్​, ప్రియాంకతో కలిసి టూర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.