'పీఎం కేర్స్' విరాళాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.
'పీఎం కేర్స్పై సందేహాలు: ఈ నిధి ప్రభుత్వానిదా, ప్రైవేటు కంపెనీలదా? అని ఇంకా స్పష్టంగా తెలియదు' అని ఉన్న ఓ ఆంగ్ల వార్తా పత్రిక శీర్షికను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. 'పీఎం కేర్స్- చలియే ట్రాన్స్పరెన్సీ కో వనక్కం (పారదర్శకతకు నమస్తే)' అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు రాహుల్.
-
PM Cares- 'Chaliye, transparency ko vanakkam'! pic.twitter.com/EgGR7LiYH9
— Rahul Gandhi (@RahulGandhi) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Cares- 'Chaliye, transparency ko vanakkam'! pic.twitter.com/EgGR7LiYH9
— Rahul Gandhi (@RahulGandhi) December 17, 2020PM Cares- 'Chaliye, transparency ko vanakkam'! pic.twitter.com/EgGR7LiYH9
— Rahul Gandhi (@RahulGandhi) December 17, 2020
ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మోదీకి బుధవారం పలు ప్రశ్నలు సంధించారు. మరుసటి రోజే రాహుల్ ఈ విమర్శలకు దిగటం గమనార్హం.
ఇదీ చూడండి:పీఎం కేర్స్ విదేశీ విరాళాలపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం