Rahul Gandhi Bike Ride : కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లోని లేహ్‌లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా భారత్ - చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు ఆయన సోర్ట్స్ బైక్‌పై వెళ్లారు. 'ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని నా తండ్రి రాజీవ్ గాంధీ చెప్పేవారు' అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
'సూపర్ సర్.. రేసర్‌లా ఉన్నారుగా'
Rahul Gandhi Ladakh Trip : రాహుల్ గాంధీ బైక్ రైడ్‌కు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 'Upwards And Onwards - Unstoppable!' అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ కొత్త లుక్‌పై ఆ పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు.. సూపర్ సర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ రేసర్‌లా ఉన్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
టూరిస్ట్ క్యాంప్‌లో రాహుల్ బస..
Rahul Ladakh Ride : శనివారం రాత్రి.. పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్ క్యాంప్‌లో రాహుల్ బస చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 20వ తేదీన తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని రాహుల్ ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
రెండు రోజులే ఉండాలని వచ్చినా..
Rahul Gandhi Sports Bike : గత గురువారం రాహుల్.. లేహ్ పర్యటనకు వచ్చారు. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో రాహుల్ పర్యటించడం ఇదే తొలిసారి. శుక్రవారం ఆయన లేహ్‌లోని యువతతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమవేశాలు
Rahul Gandhi Ladakh Visit : మరోవైపు, సెప్టెంబరు 10న లద్ధాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC) - కార్గిల్ ప్రాంతంలో కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్.. స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో రాహుల్.. లేహ్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మెకానిక్ అవతారమెత్తిన రాహుల్.. కష్టజీవులతో ముచ్చట్లు
మళ్లీ లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. ఈసారి అమెరికాలో 190కి.మీ జర్నీ
'రాహుల్‌కు పెళ్లి చేద్దాం.. మంచి అమ్మాయిని చూడండి'.. మహిళా రైతులతో సోనియా గాంధీ