Rahul Gandhi Bharat Nyay Yatra : బీజీపేకి వ్యతిరేకంగా దేశప్రజలందరినీ ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ- ఇప్పుడు భారత్ న్యాయ్ యాత్ర పేరుతో మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు 'ఈ యాత్ర' చేపట్టనున్నట్లు కాంగ్రెస్ బుధవారం వెల్లడించింది. 2024 జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు భారత్ న్యాయ యాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
-
🇮🇳 𝗕𝗛𝗔𝗥𝗔𝗧 𝗡𝗬𝗔𝗬 𝗬𝗔𝗧𝗥𝗔 🇮🇳
— Congress (@INCIndia) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🗓️ 14th January to 20th March
📍From Manipur to Mumbai
🛣️ 6200 kms
🚌 14 states & 85 districts 🚌 pic.twitter.com/rp6IqoQ5QB
">🇮🇳 𝗕𝗛𝗔𝗥𝗔𝗧 𝗡𝗬𝗔𝗬 𝗬𝗔𝗧𝗥𝗔 🇮🇳
— Congress (@INCIndia) December 27, 2023
🗓️ 14th January to 20th March
📍From Manipur to Mumbai
🛣️ 6200 kms
🚌 14 states & 85 districts 🚌 pic.twitter.com/rp6IqoQ5QB🇮🇳 𝗕𝗛𝗔𝗥𝗔𝗧 𝗡𝗬𝗔𝗬 𝗬𝗔𝗧𝗥𝗔 🇮🇳
— Congress (@INCIndia) December 27, 2023
🗓️ 14th January to 20th March
📍From Manipur to Mumbai
🛣️ 6200 kms
🚌 14 states & 85 districts 🚌 pic.twitter.com/rp6IqoQ5QB
మణిపుర్ నుంచి ముంబయి వరకు
2024 జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు 'భారత్ న్యాయ యాత్ర' నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. భారత్ న్యాయ్ యాత్ర మణిపుర్ నుంచి ముంబయి వరకు మొత్తం 6,200 కి.మీ మేర నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. సబ్కే లియో న్యాయ్ అనేది ఈ యాత్ర సందేశమని వెల్లడించారు. భారత్ న్యాయ యాత్రలో యువత, మహిళలు, బలహీనవర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తారని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
-
𝗕𝗛𝗔𝗥𝗔𝗧 𝗡𝗬𝗔𝗬 𝗬𝗔𝗧𝗥𝗔
— Congress (@INCIndia) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The yatra will cover a distance of 6200 kms, spanning 14 states (Manipur, Nagaland, Assam, Meghalaya, West Bengal, Bihar, Jharkhand, Odisha, Chhattisgarh, UP, Madhya Pradesh, Rajasthan, Gujarat & Maharashtra) and 85 districts.
The mode of the… pic.twitter.com/iqdrUsZqf0
">𝗕𝗛𝗔𝗥𝗔𝗧 𝗡𝗬𝗔𝗬 𝗬𝗔𝗧𝗥𝗔
— Congress (@INCIndia) December 27, 2023
The yatra will cover a distance of 6200 kms, spanning 14 states (Manipur, Nagaland, Assam, Meghalaya, West Bengal, Bihar, Jharkhand, Odisha, Chhattisgarh, UP, Madhya Pradesh, Rajasthan, Gujarat & Maharashtra) and 85 districts.
The mode of the… pic.twitter.com/iqdrUsZqf0𝗕𝗛𝗔𝗥𝗔𝗧 𝗡𝗬𝗔𝗬 𝗬𝗔𝗧𝗥𝗔
— Congress (@INCIndia) December 27, 2023
The yatra will cover a distance of 6200 kms, spanning 14 states (Manipur, Nagaland, Assam, Meghalaya, West Bengal, Bihar, Jharkhand, Odisha, Chhattisgarh, UP, Madhya Pradesh, Rajasthan, Gujarat & Maharashtra) and 85 districts.
The mode of the… pic.twitter.com/iqdrUsZqf0
14 రాష్ట్రాల్లో జరగనున్న యాత్ర
మణిపుర్ నుంచి భారత న్యాయ యాత్ర మొదలై అసోం, మేఘాలయ, బంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ భారత న్యాయ యాత్ర జరుగుతుంది. అయితే, భారత్ జోడో యాత్రలా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈ సారి బస్సు యాత్ర కూడా చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. మధ్యమధ్యలో పాదయాత్ర కూడా ఉంటుందని ఆయన తెలిపారు.
భారత్ జోడో యాత్ర
గతేడాది సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర దాదాపు ఐదు నెలల పాటు 4500కి.మీల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి దీనిని ముగించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు ఆయనకు సంఘీభావం తెలిపారు. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్- ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.
సీడబ్ల్యూసీ భేటీ.. సోనియా, రాహుల్ నాయకత్వానికే జై!
2024 ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ- మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా చిదంబరం