తమిళనాడులో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. ఆదివారం ఉదయం.. ఈరోడ్ జిల్లా పెరుందరయ్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
'నా మనసులోని మాటలు మీకు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీ సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి ఇక్కడకు వచ్చాను' అని పేర్కొంటూ.. పరోక్షంగా ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'పై విమర్శలు గుప్పించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ.. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న కొయంబత్తూర్‌లో పర్యటించారు.