కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనే సత్యాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణలు చెబుతూ.. అత్యంత వివాదాస్పదమైన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజునే.. రాహుల్ ఈమేరకు ట్వీట్ చేశారు.
-
अब चीनी क़ब्ज़े का सत्य भी मान लेना चाहिए।
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">अब चीनी क़ब्ज़े का सत्य भी मान लेना चाहिए।
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2021अब चीनी क़ब्ज़े का सत्य भी मान लेना चाहिए।
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2021
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్.. దేశ ప్రాదేశిక సమగ్రతకు రాజీపడిందని ఆరోపించింది. లద్దాఖ్ ప్రతిష్టంభన తర్వాత వాస్తవాదీన రేఖ వెంబడి పరిస్థితులపై అసలు నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
లద్దాఖ్ సరిహద్దులో సున్నితమైన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఇప్పటివరకు 13 సార్లు చర్చలు జరిగినా.. ఎలాంటి పురోగతి సాధించలేదు. అయితే 14వ విడత చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.
గతేడాది మే 5న భారత్-చైనా బలగాల మధ్య తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఇరుపక్షాలు క్రమంగా తమ బలగాల మోహరింపును పెంచాయి. ప్రస్తుతం సరిహద్దుకు ఇరువైపుల 50 నుంచి 60 వేల మంది చొప్పున సైనికులను మోహరించాయి.
ఇదీ చూడండి: అజయ్ మిశ్రా హాజరయ్యే సమావేశానికి మోదీ రావొద్దు: ప్రియాంక