ETV Bharat / bharat

బ్లాక్​ ఫంగస్​పై కేంద్రానికి రాహుల్ మూడు ప్రశ్నలు - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

దేశంలో బ్లాక్ ​ఫంగస్​ కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్​ ఫంగస్​ చికిత్సకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. సరైన చికిత్సా విధానం లేక బ్లాక్​ ఫంగస్ బాధితులు సతమతమవుతున్నారని తెలిపారు.

rahul gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Jun 1, 2021, 1:36 PM IST

దేశంలో బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. బ్లాక్​ ఫంగస్​కు చికిత్స ఇవ్వకుండా.. ప్రజలను కేంద్రం అయోమయంలోకి నెట్టేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్​లో కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

" బ్లాక్​ ఫంగస్​ వ్యాధిపై ప్రజలకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. 1)బ్లాక్​ ఫంగస్​ ఔషధం ఆమ్​ఫోటెరిసిన్-బీ కొరతపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?. 2) ఈ ఔషధాన్ని పొందాల్సిన పద్ధతులు ఏంటి?. 3) బ్లాక్​ ఫంగస్​ వ్యాధికి చికిత్స ఇవ్వకుండా నిబంధనల పేరుతో ప్రజలను ఎందుకు అయోమయంలోకి నెట్టేస్తున్నారు?"

-- రాహుల్​గాంధీ, కాంగ్రెస్ నేత

అమెరికా నుంచి భారత్​కు 2లక్షల బ్లాక్​ ఫంగస్ ఔషధాలు(ఆమ్​ఫోటెరిసిన్-బీ) చేరినట్లు అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్ సింగ్​ సంధూ తెలిపారు.

ఇదీ చదవండి: 'కేంద్రం వైఫల్యంతో 97% మంది ప్రజలకు నష్టం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.