కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాతృభాషల శక్తిని ప్రశంసించారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందని అన్నారు. మహారాష్ట్ర మేల్ఘట్ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజల్లో టీకా అపోహలను స్థానిక కోర్కు భాషను ఉపయోగించి తొలగించినట్లు తెలిపారు. దీని గురించి వివరించే ఓ మీడియా కథనాన్ని జోడిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.
మేల్ఘట్ అటవీ ప్రాంతంలో ఉండే వారిపై వచ్చిన కథనం.. స్థానిక భాషలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కోర్కు మాట్లాడే ప్రజలకు వంద శాతం టీకాను వేసినందుకు స్థానిక అధికార యంత్రాగాన్ని అభినందించారు.
ఇదీ చూడండి: PM Modi: 'విశ్వవేదికపైకి మరిన్ని విద్యా సంస్థలు'