ETV Bharat / bharat

'అదానీ ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పగలరా?'

అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్ అదానీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలు విలవిలలాడిపోయిన వేళ అదానీ తన సంపదనను 50శాతం ఎలా పెంచుకోగలిగారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

rahul criticizes gautam adani over wealth surge
అదానీ ఆస్తులు భారీగా పెరగటంపై రాహుల్ ఫైర్
author img

By

Published : Mar 13, 2021, 6:10 PM IST

అదానీ సంస్థల ఛైర్మన్​ గౌతమ్ అదానీ సంపద వృద్ధిపై వచ్చిన వార్తలపై స్పందించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలు విలవిలలాడిన వేళ అదానీ తన సంపదనను 50శాతం ఎలా పెంచుకోగలిగారని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు.

'2020లో మీ సంపద ఎంత పెరిగింది?' అని రాహుల్​ ప్రజలను ప్రశ్నించారు. అయితే ప్రజల ఆస్తి ఏమీ పెరగలేదని అన్నారు. ప్రజలంతా బతకడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గౌతమ్‌ అదానీ 12లక్షల కోట్ల రూపాయలను సంపాదించారని పేర్కొన్నారు. 'దానికి కారణం ఏమిటో చెప్పగలరా?' అని అడిగారు.

ఇదీ చూడండి: అదానీ చేతికి గంగవరం పోర్టు?

ఇదీ చూడండి: 'వారి చేతుల్లో దేశం బందీ అవుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.