మోదీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతు మద్దతుదారులపై కేంద్రం.. సోదాల పేరిట దాడులు చేస్తోందని ఆరోపించారు.
అన్నదాతలకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటులు తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సహా.. పలువురి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. 'మోదీ రెయిడ్స్ ప్రో ఫార్మర్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. 'ఉంగ్లియెన్ పే నాచ్నా', 'భీగి బిల్లీ బన్నా','ఖిసియాని బిల్లీ ఖంబా నీచే' అనే మూడు ప్రముఖ హిందీ జాతీయాలను ప్రస్తావించారు. కేంద్రం సూచనల మేరకు ఆదాయ పన్ను శాఖ నృత్యం చేస్తోందని, స్నేహపూర్వక మీడియా ఎన్డీఏ సర్కార్ ముందు మోకరిల్లిందని, రైతులకు మద్దతు ప్రకటించిన వారిపై కేంద్రం దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: హిందుత్వంపై భాజపాకు ఉద్ధవ్ చురకలు