ETV Bharat / bharat

సెక్స్​ విషయమై ఇద్దరు 'గే'ల మధ్య గొడవ.. ఒకరి హత్య - karnataka crime news

శృంగారం విషయంలో ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య తలెత్తిన వివాదం హత్యతో ముగిసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని జుడీషియల్​ కస్టడీకి తరలించారు.

bangalore gay killed
bangalore gay murdered
author img

By

Published : Jun 11, 2022, 10:07 AM IST

సెక్స్​ విషయంలో ఇద్దరు స్వలింగ సంపర్కుల (గేల) మధ్య జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది: మూడలపాళ్యకు చెందిన నిందితుడు రక్షిత్​ గౌడ.. ఆటో డ్రైవర్​గా పనిచేస్తూ ఉండేవాడు. బాధితుడు ప్రదీప్​ది మడివాళ. ప్రదీప్​ పురుషుడే అయినప్పటికీ.. మహిళా వేషధారణలో తిరిగేవాడు. క్యాషియర్​ లేఅవుట్​లో ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఓ షాపులో పనిచేసేవాడు. అతడికి పురుషులతో సంబంధాలు పెట్టుకోవడంపై ఆసక్తి ఎక్కువ.

ఈ క్రమంలోనే ప్రదీప్ ఇంటికి రక్షిత్ మూడుసార్లు వచ్చాడు. వారి మధ్య లైంగిక సంబంధమూ ఉంది. ప్రదీప్​ను తొలుత మహిళగా భావించిన నిందితుడు.. అతడు పురుషుడు అని తెలిసినా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు.
"మే 28న ఎప్పటిలాగే ప్రదీప్​ ఇంటికి రక్షిత్​ వచ్చాడు. మద్యం సేవించిన అనంతరం సెక్స్​ విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మొదట రక్షిత్​పై కత్తితో దాడి చేశాడు ప్రదీప్. అనంతరం అదే కత్తితో ప్రదీప్​ను పొడిచి రక్షిత్ హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు" అని పోలీసులు తెలిపారు.

ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన రావడం వల్ల స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్​ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కోడికూర వండలేదని.. భార్యను నరికి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.