ఒడిశాలో పూరీ జగన్నాథుని రథయాత్ర(Rath Yatra) నేడు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగానే భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు.
ఆనవాయితీ ప్రకారం నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు(చతుర్థామూర్తులు) శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరుతారు.
భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు డీజీపీ అభయ్ తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ ప్రారంభమైందని రెండు రోజుల పాటు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో భద్రతా బలగాలు మోహరించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'జగన్నాథుడి'పై కళాకృతులు.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం