ETV Bharat / bharat

Cycle Day: అగ్గిపుల్లలతో అద్భుత కళారూపం!

1870నాటి మోడల్​ సైకిల్​ అది. ఎప్పుడో పాఠశాలలో చదువుతున్నప్పుడు చూశాడతడు. దాన్ని కొనుగోలు చేయాలని ఆరాటపడ్డాడు. కానీ, ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. దాంతో తానే అగ్గిపుల్లలను ఉపయోగించి ఆ సైకిల్​ రూపాన్ని తయారు చేశాడు.

bicycle with matchsticks
అగ్గిపుల్లలతో సైకిల్
author img

By

Published : Jun 3, 2021, 5:49 PM IST

Updated : Jun 3, 2021, 6:37 PM IST

అగ్గిపుల్లలతో సైకిల్​ తయారు చేసిన ఒడిశా వాసి

ప్రపంచ సైకిల్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని ఓ కళాకారుడు.. అద్భుత కళాఖండాన్ని రూపొందించాడు. అగ్గిపుల్లలను ఉపయోగించి.. 1870 నాటి అరుదైన సైకిల్​ మోడల్​ను ఆవిష్కరించాడు.

పూరీ జిల్లాకు చెందిన శాశ్వత్​ రంజన్​ సాహూ అనే 18 ఏళ్ల యువకుడు.. 7 రోజుల పాటు శ్రమించి ఈ కళారూపాన్ని తయారు చేశాడు. 3,653 అగ్గిపుల్లలతో 50 అంగుళాల పొడవు, 25 అంగుళాల వెడల్పుతో దీన్ని రూపొందించాడు. 1870 నుంచి 1880 మధ్య కాలంలో వినియోగించిన ఈ మోడల్​ సైకిల్​ ధర.. అప్పట్లో కేవలం కొద్ది పైసలు మాత్రమే ఉండేది.

bicycle with matchsticks
అగ్గిపుల్లలతో సైకిల్ రూపొందిస్తున్న శాశ్వత్​​ రంజన్​ సాహూ
bicycle with matchsticks
అగ్గిపుల్లలతో 1870 నాటి మోడల్​ సైకిల్​

అందరూ సైకిల్​ వాడాలి..

సైకిళ్ల వాడకంపై అందరికీ అవగాహన కల్పించేందుకే తాను ఈ బొమ్మను రూపొందించానని సాహూ చెప్పాడు. కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుతం తరుణంలో సైకిల్​ను ఉపయోగించటమే ఉత్తమమైన మార్గం అని తెలిపాడు.

"నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు.. ఈ సైకిల్​ను చూశాను. అప్పుడే దీని మీద ఇష్టం ఏర్పడింది. నేను కూడా ఇలాంటి సైకిల్​ను కొనుగోలు చేయాలని అనుకున్నాను. కానీ, మా ప్రాంతంలో ఇలాంటి సైకిల్​ ఎక్కడా దొరకలేదు. ప్రపంచ సైకిల్​ దినోత్సవం సందర్భంగా నేను ఈ సైకిల్​ను తయారు చేయాలని నిశ్చయించుకున్నాను."

-శాశ్వత్​ రంజన్​ సాహూ

జూన్​ 3న ప్రపంచ సైకిల్​ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొట్టమొదటి సారిగా 2018 జూన్​ 3న న్యూయార్క్​లోని ఐరాస జనరల్​ అసెంబ్లీ వేదికగా ఐక్యరాజ్యసమితి ఈ సైకిల్​ డేని నిర్వహించింది.

ఇదీ చూడండి: చిన్నారి సాయానికి ఫిదా- సీఎం 'సైకిల్'​ గిఫ్ట్​

Last Updated : Jun 3, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.