ETV Bharat / bharat

అమరీందర్​ సింగ్ కొత్త పార్టీ పేరు ఇదే.. - పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్ నూతన పార్టీని ప్రకటించారు. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు.

amarinder singhs
అమరీందర్​ సింగ్
author img

By

Published : Nov 2, 2021, 5:53 PM IST

Updated : Nov 2, 2021, 6:09 PM IST

కాంగ్రెస్​ పార్టీతో తెగదెంపులు చేసుకున్న పంజాబ్​ మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.. సొంత పార్టీని స్థాపించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా.. పార్టీ పేరును 'పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​'గా ప్రకటించారు. పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమరీందర్ పార్టీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ పేరును ప్రకటిస్తూనే.. కాంగ్రెస్​కు రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు కెప్టెన్​. ఈ మేరకు 7 పేజీలతో కూడిన రాజీనామా లేఖను కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.

"కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈరోజు నా రాజీనామా లేఖను పంపించారు. నేను రాజీనామా చేయడానికి గల కారణాలు అందులో వెల్లడించారు. అదే సమయంలో కొత్త పార్టీ పేరు 'పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​'గా నిర్ణయించాము. పార్టీ రిజిస్ట్రేషన్​ పెండింగ్​లో ఉంది. పార్టీ గుర్తును తర్వాత ప్రకటిస్తాం."

--- అమరీందర్​ సింగ్​, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి.

పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో సెప్టెంబర్​లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్​. కాంగ్రెస్​ తనను అవమానించిందని ఆరోపించారు. అమరీందర్​ కొత్త పార్టీ పెడతారని అప్పట్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో దిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో ఆయన భేటీ అయ్యారు​. ఊహాగానాలకు తెరదించుతూ.. కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ పరిణామాలతో పంజాబ్​ ఎన్నికలు రసవత్తరంగా మారుతాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 2, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.